భారత్
సువర్ణాధ్యాయానికి పార్లమెంట్ పాత భవనం సాక్షిగా నిలిచిందని ప్రధాని నరేంద్రమోదీ
అన్నారు. పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల ప్రారంభం సందర్భంగా ప్రసంగించిన ప్రధాని మోదీ..
పార్లమెంటు 75 ఏళ్ళ ప్రస్థానంలోని ఘట్టాలను గుర్తుచేసుకుని భావోద్వేగానికి
గురయ్యారు.
రేపటి నుంచి సమావేశాలు కొత్త భవనంలో జరగనున్న వేళ, పాత భవనంలోని
స్మృతులను మోదీ గుర్తు చేసుకున్నారు.
ఎన్నో
చారిత్రిక ఘట్టాలకు వేదికగా నిలిచిన పాత పార్లమెంట్ భవనం నుంచి వీడ్కోలు
తీసుకుంటున్నామని తెలిపిన మోదీ, ఇక్కడ జరిగిన చర్చలు, ప్రణాళికలు భారత గతిని
మార్చాయి అన్నారు. ‘‘ మనం కొత్త భవనంలోకి వెళ్తున్నప్పటికీ పాత భవనం భావితరాలకు
స్ఫూర్తి నిస్తుంది’’ అని పార్లమెంట్ సభ్యులకు ప్రధాని చెప్పారు. ఈ భవనంలో చర్చలు,
వాదనలు ఎన్ని ఉన్నా మన గౌరవాన్ని మరింత పెంచిందన్నారు.
75 ఏళ్ళలో 7,500 మంది
ఎంపీలు, 17 మంది స్పీకర్లు ఈ భవనంలో పనిచేశారని వివరించారు. భారతదేశాన్ని 2047
నాటికి అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దడానికి తీసుకోబోయే నిర్ణయాలన్నీ కొత్త
పార్లమెంటు భవనంలోనే నిర్ణయించబడతాయన్నారు. 75 ఏళ్ల పార్లమెంటు ప్రస్థానం కొత్త
గమ్యం నుంచి మొదలవుతోందన్నారు. ప్రజల సందర్శనార్థం పాత భవనాన్ని తెరిచే ఉంచాలని
నిర్ణయించినట్లు తెలిపారు.
చంద్రయాన్-3
విజయం, భారత సాంకేతిక అభివృద్ధికి నిదర్శనమని చెప్పిన ప్రధాని. దేశ అభివృద్ధి
ప్రపంచమంతా ప్రకాశిస్తోందన్నారు. సమష్టి కృషి కారణంగానే జీ-20 సదస్సు
విజయవంతమైందన్న ప్రధాని, అనేక రంగాల్లో భారత్ గణనీయంగా అభివృద్ధి చెందిందని
పేర్కొన్నారు.
అనేక దేశాలకు భారత్ విశ్వమిత్రగా మారుతోందన్నారు. భారత
సామర్థ్యాన్ని ప్రతిదేశం ప్రశంసిస్తోందన్నారు. జీ 20లో ఆఫ్రికన్ యూనియన్ రావడం చారిత్రక
ఘట్టమని అభిప్రాయపడ్డారు. పార్లమెంటులో
క్రమక్రమంగా మహిళల సంఖ్య పెరిగిందని హర్షం వ్యక్తం చేశారు.