నిపా
వైరస్ విజృంభణ కేరళ ప్రజలను భయాందోళనకు
గురిచేస్తుండగా, స్ర్కబ్ టైపస్ ఒడిశావాసులను వణికిస్తోంది. ఈ వ్యాధితో తాజాగా
ఇద్దరు మృతి చెందగా, దీని భారిన పడి మరణించిన వారి సంఖ్య 8కి చేరింది. సుందర్‌గఢ్
జిల్లాలో కేసులు ఎక్కువగా వెలుగుచూడటంతో స్థానికులు ఆందోళన వ్యక్తం
చేస్తున్నారు.
ఒక
రకమైన లార్వా పురుగులు కుట్టడంతో ఈ వ్యాధి సోకుతుంది. పంట భూములు, అటవీ ప్రాంతాల్లోని
వారికి వ్యాధి సోకే అవకాశం ఎక్కువుగా ఉంటుంది. ఈ వ్యాధి బాధితులకు జ్వరం, పురుగు
కుట్టిన చోట చర్మంపై నల్లమచ్చ ఏర్పడటం
ప్రధాన లక్షణాలని వైద్యులు చెబుతున్నారు.
కలహండి
జిల్లాకు చెందిన ఓ 34 ఏళ్ళ మహిళా రైతు ఈ వ్యాధి భారిన పడి ప్రైవేటు ఆస్పత్రిలో
చికిత్స పొందుతూ మరణించారని ఆ జిల్లా వైద్యాధికారి నిహరేంద్ర పండా తెలిపారు. బర్గడ్
జిల్లాలో మరో వ్యక్తి ఈ వ్యాధి కారణంగా ప్రాణాలు విడిచారు.
సుందర్‌గఢ్
జిల్లాలో ఆదివారం ఒక్క రోజే 11 మందికి వ్యాధి నిర్ధారణ అయిందని జిల్లాలో మొత్తం
యాక్టివ్ కేసులు 180 గా ఉన్నట్లు అధికారులు తెలిపారు. గత నెలలో ఓ వ్యక్తి
మరణించారు.
జిల్లా వ్యాప్తంగా వ్యాధి నిర్దారణ పరీక్షలు ముమ్మరం చేసినట్లు జిల్లా
వైద్యాధికారి ఖనూ చరన్ నాయక్ తెలిపారు. ప్రత్యేక వైద్య బృందాన్ని ఏర్పాటు చేసి
స్క్రబ్ టైపస్ బాధితులకు చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. ఎలిసా పరీక్ష ద్వారా వ్యాధిని నిర్ధారిస్తామని చెప్పారు. ఆరంభంలోనే
వ్యాధిని గుర్తిస్తే ప్రభావంతమైన చికిత్స అందించే అవకాశముందని తెలిపారు.