ఆంధ్రప్రదేశ్లో తెలుగు భాషను సమీపంలోని సముద్రంలో కలిపేశారంటూ ప్రవచనకారుడు పద్మశ్రీ పురస్కార గ్రహీత గరికపాటి నరసింహారావు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలోని వనపర్తి జిల్లా ఆత్మకూరులో భగవద్గీత ప్రచార పరిషత్ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
ఆంధప్రదేశ్ ఏపీ అయిపోయిందని, ఈ విషయంలో తెలంగాణ కొంచెం మెరుగ్గా ఉందని ఇంకా టీఎస్ కాలేదని ఆయన అభిప్రాయపడ్డారు. ఆంధ్రప్రదేశ్ అని పిలవడం ప్రజలు మరచిపోయారని ఏపీని ఉద్దేశించిన నరసింహారావు చేసిన వ్యాఖ్యలు వైరల్గా మారాయి. ఏపీ ప్రభుత్వాన్ని ఉద్దేశించిన ఆయన ఈ వ్యాఖ్యలు చేసినట్టుగా తెలుస్తోంది.