ఆసియా
కప్ -2023లో శ్రీలంకను భారత్ చిత్తు చేసి టైటిల్ పోరులో విజేతగా నిలిచింది. ఫైనల్ లో భారత బౌలర్లు విజృంభించి భారత విజయంలో కీలక పాత్ర పోషించారు.
టాస్
గెలిచి బ్యాంటింగ్ ఎంచుకున్న శ్రీలంక 15.2 ఓవర్లలో 50 పరుగులకే ఆలౌటైంది.
భారత
పేసర్ మహ్మద్ సిరాజ్, 7 ఓవర్లలో 21 పరుగులిచ్చి 6 వికెట్లు తీశాడు. సిరాజ్ ధాటికి
ఓ దశలో లంక 12 పరుగులకే 6 వికెట్లు నష్టపోయింది. లంకను కట్టడి చేయడంలో హార్దిక్
పాండ్యా, బుమ్రా, కూడా తమ వంతు పాత్ర పోషించారు. హార్దిక్ పాండ్యా 3 వికెట్లు
తీయగా, బుమ్రా ఒక వికెట్ పడగొట్టారు. లంక ఇన్నింగ్స్ లో ఐదుగురు బ్యాట్స్మెన్
ఖాతా తెరవకుండానే పెవిలియన్ బాటపట్టారు.
వన్డేల్లో
అత్యల్ప పరుగుల రికార్డు జింబాబ్వే, అమెరికా జట్ల పేరిట ఉంది. ఆ రెండు జట్లు 35
పరుగులకే ఆలౌటయ్యాయి.
ఓపెనర్
కుశాల్ పెరీరా(0) బుమ్రా ఔట్ చేశాడు. తొలి ఓవర్ మెయిడెన్ వేసిన సిరాజ్ రెండో ఓవర్
తొలి బంతికే వికెట్ పడగొట్టాడు. ఓపెనర్ పథుమ్ నిస్సంక(2)ను ఔట్ చేశాడు. ఆ తర్వాత
మూడో బంతికి సధీర సమరవిక్రమ(0) ను పెవిలియన్ కు పంపగా, నాలుగో బంతికి అసలంక(0)ను
ఔట్ చేసి హ్యాట్రిక్ పై నిలిచాడు.
ధనంజయ
డిసిల్వా(4) ఐదో బంతికి బౌండరీ కొట్టాడు. ఆ మరుసటి బంతికే రాహుల్ కు క్యాచ్ ఇచ్చి
ఔట్ అయ్యాడు. దాంతో లంక 12 పరుగులకే ఐదు వికెట్లు నష్టపోయింది. కుశాల్ మెండిస్(17)ను
బౌల్డ్ చేసి ఆరో వికెట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు సిరాజ్.
51
పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన భారత్ ఓపెనర్లు శుభ్ మన్ గిల్, ఇషాన్ కిషన్ లు ధాటిగా ఆడింది. ప్రమోద్ వేసిన మొదటి ఓవర్ లో ఏడు పరుగులు
రాబట్టారు. పతిరన వేసిన రెండో ఓవర్ లో 10 పరుగులు వచ్చాయి. ప్రమోద్ వేసిన మూడో ఓవర్లలో
భారత్ వికెట్లు నష్టపోకుండా 32 పరుగులు చేసింది. ఆరో ఓవర్ కు శుభమన్ గిల్ (27),
కిషన్ (22) పరుగులు చేయడంతో భారత్ విజయం సాధించింది. ఆసియా కప్ 2023 టైటిల్ ను
అందుకుంది.