ఆసియా కప్ ఫైనల్స్లో భారత బౌలర్లు సత్తా చాటారు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆనందం లేకుండా లంకపై విరుచుకుపడ్డారు. భారత బౌలర్ల దెబ్బకు లంక టాప్ ఆర్డర్ పేకమేడలా కుప్పకూలింది. 12 పరుగులకే 6 వికెట్లు తీయడంతో లంక టీం డిఫెన్సులో పడిపోయింది. ముఖ్యంగా భారత బౌలర్ మహమ్మద్ సిరాజ్ ఒకే ఓవర్లో నాలుగు వికెట్లు కూల్చాడు.
బుమ్రా వికెట్ల వేటను ప్రారంభించగా, సిరాజ్ మరింత చెలరేగిపోయాడు. శ్రీలంక బ్యాటర్లు సమరవిక్రమ, చరిత్ అసలంక, దాసున్ శానలను సిరాజ్ డకౌట్ చేశాడు. ఇక ధనంజయ డిసిల్వా 4 పరుగులు, నిస్సాంక 2 పరుగులకే ఇంటి దారి పట్టించాడు. ఒక్క రోజే 5 వికెట్లు తీసి 50 వికెట్లు తీసిన క్లబ్లో సిరాజ్ చేరారు.