ప్రధానమంత్రి
నరేంద్రమోదీకి జన్మదిన శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. దేశంతో పాటు
ప్రపంచవ్యాప్తంగా పలువురు ప్రముఖులు, మోదీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.
దూరదృష్టి,
అవిశ్రాంతమైన కృషి, నిస్వార్థసేవ ద్వారా కోట్లాది ప్రజల జీవితాల్లో వెలుగులు
నింపారంటూ మోదీని కొనియాడారు. దీర్ఘాయుష్షు, మంచి ఆరోగ్యం ప్రసాదించాలని
భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు సందేశాలు పంపారు.
నేడు
73వ పుట్టినరోజు జరుపుకుంటున్న నరేంద్ర మోదీ, ప్రధాని హోదాలో పదో జన్మదిన వేడుక జరుపుకుంటున్నారు.
ఇవాళ
విశ్వకర్మ జయంతి సందర్భంగా విశ్వకర్మ యోజన పథకాన్ని ప్రధాని మోదీ ప్రారంభించారు. తల్లి
లేకుండా మోదీ జరుపుకుంటున్న తొలి పుట్టిన రోజు ఇదే.
ప్రధాని
పుట్టిన రోజు సందర్భంగా కేంద్ర ప్రభుత్వం పలు సంక్షేమ కార్యక్రమాలను ఆదివారం
ప్రారంభించింది. క్షేమ ఆయుష్మాన్ భవ పేరుతో సమగ్ర ఆరోగ్య సంరక్షణ, సేవా సంఖ్యావార
పేరుతో మరో కార్యక్రమాన్ని ఆరంభించనుంది.
ప్రధాని
మోదీకి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము శుభాకాంక్షలు తెలిపారు. మోదీ దూరదృష్టి, బలమైన
నాయకత్వంతో ప్రతి రంగంలో దేశ అభివృద్ధికి మరింత కృషి చేయాలని కోరుకుంటున్నా అంటూ
రాష్ట్రపతి ముర్ము ట్వీట్ చేశారు.
కాంగ్రెస్
అగ్రనేత రాహుల్ గాంధీ, మోదీకి సోషల్ మీడియా వేదికగా శుభకాంక్షలు తెలపగా, దిల్లీ
ముఖ్యమంత్రి కేజ్రీవాల్, మోదీ ఆరోగ్యంగా ఉండాలని ప్రార్థిస్తున్నా అని సందేశం
పంపారు.
కేంద్రమంత్రులు
అమిత్ షా, రాజ్ నాథ్ సింగ్, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా తో పాటు పలువురు
సీఎంలు, ప్రముఖ రాజకీయ నేతలు మోదీకి శుభాకాంక్షలు తెలిపారు.