కోవిడ్‌తో
పోలిస్తే నిపా చాలా ప్రమాదకరమైందని భారత వైద్య పరిశోధన మండలి(ICMR) తెలిపింది. కోవిడ్ కేసుల్లో మరణాలు 2
నుంచి 3 శాతం ఉండగా నిపా వైరస్ సోకితే 40
శాతం నుంచి 70 శాతం ఉంటాయని ఐసీఎంఆర్ డైరక్టర్ రాజీవ్ బహల్ తెలిపారు.
కేరళలోని
కోళికోడ్ లో తాజాగా ఓ వ్యక్తికి నిపా సోకిందని దీంతో ఇప్పటి వరకు ఆరుగురు ఈ వైరస్
భారినపడ్డారని చెప్పారు. ఈ మహమ్మారి సోకి ఇప్పటి వరకు ఇద్దరు మరణించినట్లు
పేర్కొన్నారు.
నిపా
చికిత్సలో ఉపయోగించే మోనోక్లోనల్ యాంటీబాడీ
మందులను ఆస్ట్రేలియా నుంచి తెప్పిస్తున్నట్లు చెప్పారు. 2018లో కొనుగోలు
చేసిన డోసులు, పది మంది రోగులకు మాత్రమే సరిపోతాయన్నారు.
దక్షిణాది
రాష్ట్రాల్లో ఈ వైరస్ వ్యాప్తి చెందడంపై ఆందోళన వ్యక్తం చేసిన ఐసీఎంఆర్, వైరల్
వ్యాధుల కట్టడి కోసం వ్యాక్సిన్ తయారీపై దృష్టి సారించాలన్నారు.
విదేశాల
నుంచి వచ్చిన వారిలో 14 మందికి నిపా సోకిందని, వారు మోనోక్లోనల్ మందు వాడటంతో
కోలుకున్నారని చెప్పారు. ఇన్ఫెక్షన్ ప్రారంభదశలో ఉన్నప్పుడే ఈ మందును వాడాలని
సూచించారు.
నిపా
వైరస్ వర్షాకాలంలోనే ఎక్కువగా వ్యాపిస్తుందని, దీనిని అరికట్టేందుకు చేతులు శుభ్రం
చేసుకుంటూ మాస్క్ తప్పనిసరిగా ధరించాలని కోరారు.
వైరస్ గబ్బిలాల నుంచి సోకుతుందని
గతంలో వెల్లడించినప్పటికీ ఎలా అనే దానిపై స్పష్టత లేదు.
కోళికోడ్
లో నిపా బాధితుల సంఖ్య పెరుగుతుండటంతో ఆ రాష్ట్రంలో కేంద్ర నిపుణుల బృందం
పర్యటించి వైరస్ వ్యాప్తిపై అధ్యయనం
చేయనుంది.
కోళికోడ్
లో 39 ఏళ్ళ వ్యక్తికి ఈ వైరస్ సోకినట్లు నిర్ధారించారు. నిపా కారణంగా ఆగస్టు 30న
చనిపోయిన వ్యక్తికి సన్నిహితంగా ఉండటం వల్లే అతడికి కూడా పాజిటివ్ వచ్చినట్లు కేరళ ఆరోగ్యమంత్రి వీణా జార్జ్ తెలిపారు.
కోళికోడ్
జిల్లా యంత్రాంగం విద్యాసంస్థలకు నేటి నుంచి వారం రోజులపాటు సెలవు ప్రకటించింది. కర్ణాటక,
తమిళనాడు ప్రభుత్వాలు కూడా అప్రమత్తమయ్యాయి. కట్టడి చర్యలు ముమ్మరం చేశాయి.
పాజిటివ్
వచ్చిన వారితో సన్నిహితంగా ఉన్నవారి సంఖ్య 1,080 ఉండగా వారిలో 327 మంది ఆరోగ్య
సిబ్బంది ఉన్నారు.