జాతీయ
దర్యాప్తు సంస్థ(NIA) తమిళనాడు, తెలంగాణలో30 చోట్ల
ఏకకాలంలో సోదాలు నిర్వహిస్తోంది. ఐఎస్ఐఎస్(ISIS) తో లింకున్న కేసుకు సంబంధించిన దర్యాప్తులో భాగంగా ఈ తనిఖీలు
నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది.
కోయంబత్తూరులో
21 చోట్ల, చెన్నైలో మూడు చోట్ల, తెన్కాశిలో
ఒక చోట, హైదరాబాద్ లో ఐదు ప్రదేశాల్లో తనిఖీలు నిర్వహిస్తున్నారు.
నిషేధిత
ఐఎస్ఐఎస్ కదలికలు, నియామకాలకు సంబంధించిన విషయాల్లో విచారణ జరుగుతోంది.
గత
ఏడాది కోయంబత్తూరులో జరిగిన కారు బాంబు పేలుడు కేసులో ఓ వ్యక్తిని అరెస్టు చేశారు. ఐఎస్ఐఎస్
కోణంలో ఈ విచారణ చేస్తున్నారు. అతడికి ఉగ్రసంస్థతో ఉన్న సంబంధాలపై ఆరా తీస్తున్నారు. ఈ కేసులో అరెస్టైన 13 వ్యక్తి మహమ్మద్
అజారుద్దీన్ అలియాస్ అజార్ ప్రస్తుతం త్రిశూర్ జైల్లో ఉన్నారు. అతడి నుంచి
సేకరించిన వివరాల ఆధారంగా ఈ తనిఖీలు జరుగుతున్నాయి.
గత
ఏడాది అక్టోబర్ 23న కొయంబత్తూరులోని ఆర్లుమిగు కొట్టాయి సంగమేశ్వరర్ తిరుకోవిల్
వద్ద కారులో పేలుడు సంభవించింది. మొదట్లో దీనిని అంతా ప్రమాదంగా భావించారు. కానీ
పోలీసుల విచారణలో విస్తుపోయే అంశాలు వెలుగులోకి వచ్చాయి.
పేలుడు
జరిగిన వాహనంలో మేకులు, చలువరాళ్లు, ఇతర వస్తువులు గుర్తించారు. నిందితుడి ఇంట్లో
సోదాలు చేసినప్పుడు తక్కువ తీవ్రత గల పేలుడు పదార్థాలను గుర్తించారు.
జమేశా ముబీన్
అనే వ్యక్తి ఆత్మాహుతి దాడికి యత్నించి మరణించినట్లు పోలీసులు తేల్చారు.
ముబిన్
తో పాటు అతని సన్నిహితులు కొంతమంది ఐఎస్ఎస్ భావజాలంతో స్ఫూర్తి చెంది ఈ
దురాఘాతానికి యత్నించారని చెప్పారు. ఇస్లాం వ్యతిరేకించే వారిపై ప్రతీకార చర్యలో
భాగంగానే ఈ కుట్రకు పాల్పడి దాడి చేశారని వివరించారు.
ఈ
కేసును దర్యాప్తు చేస్తున్నNIA,
ఇప్పటికే కోర్టులో రెండు ఛార్జిషీట్లు దాఖలు చేసింది. ఇప్పటి వరకు మొత్తం 13
మందిని అరెస్టు చేసింది.