ఆసియా
కప్ సూపర్-4 చివరి లీగ్ మ్యాచ్‌లో భారత్ ఓడింది. కొలంబోలో బంగ్లాదేశ్‌తో జరిగిన
పోరులో భారత్ ఆరు పరుగుల తేడాతో పరాజయం చెందింది. ఆఖరి ఆరు బంతుల్లో 12 పరుగులు
చేయాల్సి ఉండగా, క్రీజులో ఉన్న షమీ తొలి మూడు బంతుల నుంచి ఎలాంటి రన్స్
రాబట్టలేకపోయారు.
నాలుగో బంతిని ఫోర్ కొట్టినా, ఆ తర్వాత బంతికి డబుల్ తీయబోయి
రనౌట్ అయ్యారు. దాంతో భారత్ జట్టు ఇన్నింగ్స్ ముగిసింది.
ఈ
మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లకు 265
పరుగులు చేయగా, లక్ష్యఛేదనలో భారత్ 49.5 ఓవర్లలో 259 పరుగులు చేసి ఆలౌట్ అయింది.
ఆసియా
కప్-2012లోనూ భారత్‌ను బంగ్లాదేశ్ ఓడించింది.
టాస్
ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్ 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 265
పరుగులు చేసింది. కెప్టన్ షకీబ్ అల్ హసన్, 85 బంతుల్లో 80 పరుగులు చేశారు. తౌహీద్
హృదయ్ 81 బంతుల్లో 54 పరుగులు చేసి ఆకట్టుకున్నారు. 49 పరుగులకే జట్టు 4 వికెట్లు
కోల్పోగా, ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ షకీబ్, తౌహీద్ ఐదో వికెట్‌కు 101 పరుగులు చేసి
జట్టును ఆదుకున్నారు.
భారత బౌలర్లలో శార్దూల్ మూడు, షమీ రెండు వికెట్లు
పడగొట్టారు.
శుభమన్
గిల్ కెరీర్ లో ఐదో సెంచరీ చేశారు. 133 బంతుల్లో 121 పరుగులు సాధించారు. ఇతర
బ్యాటర్ల వైఫల్యంతో జట్టు ఓడింది. అక్షర్ పటేల్ 34 బంతుల్లో 42 పరుగులు చేసినా
లాభం లేకపోయింది.
సూపర్-4
లీగ్ లో బంగ్లాదేశ్ జట్టుకు ఇదే తొలి విజయం. ఈ నెల 17న జరిగే ఫైనల్లో భారత్ శ్రీలంక
తలపడనున్నాయి. కొలంబోలోని ప్రేమదాస స్టేడియం వేదికగా ఈ పోరు జరగనుంది.