చంద్రుడి
ఉపరితలంపై నీటి ఆనవాళ్లకు సంబంధించిన అధ్యయనాల్లో ఆసక్తికర విషయాలు
వెల్లడవుతున్నాయి. భూ వాతావరణంలోని ఎలక్ట్రాన్స్ కారణంగానే జాబిల్లిపై నీరు
ఏర్పడిందని యూనివర్సిటీ ఆఫ్ హవాయి శాస్త్రవేత్తలు చెబుతున్నారు. భారత్ ప్రయోగించిన
చంద్రయాన్-1 నుంచి సేకరించిన డేటా ఆధారంగానే ఈ విషయాన్ని గుర్తించినట్లు తెలిపారు.
చంద్రయాన్-1
మిషన్ లోని మూన్ మినరాలజీ మ్యాపర్ పరికరం
సేకరించిన రిమోట్ సెన్సింగ్ డేటాను హవాయి శాస్త్రవేత్తల బృందం అధ్యయనం చేసింది.
భూవాతావరణంలో
ఉండే ఎలక్ట్రాన్స్, చంద్రుడిపై నీరు ఏర్పడటానికి దోహదపడి ఉంటాయని జర్నల్ నేచర్
ఆస్ట్రానమీలో ప్రచురించారు.
భూ
అయస్కాంతావరణానికి వెలుపల చంద్రుడు ఉన్నప్పుడు, సౌరగాలి లూనార్ ఉపరితలాన్ని
తాకుతుందని లోపల ఉన్నప్పుడు మాత్రం అందుకు పూర్తి భిన్నంగా ఉంటుందని అప్పుడు నీరు
ఏర్పడే అవకాశమే లేదని తాజా అధ్యయనం ద్వారా తెలుస్తోంది.
భూ అయస్కాంతావరణంలో
చంద్రుడు ప్రయాణిస్తున్నప్పుడు కూడా అక్కడ జాబిల్లిపై నీరు ఏర్పడినట్లు చంద్రయాన్
1 సేకరించిన రిమోట్ సెన్సింగ్ డేటాను పరిశీలిస్తే తెలుస్తోందని శాస్త్రవేత్తలు
పేర్కొన్నారు.
సౌరగాలిలోని
ప్రోటాన్లతో సంబంధం లేకుండానే జాబిల్లిపై నీరు ఏర్పడే అదనపు మార్గాలున్నాయని
తెలిసినట్లు వెల్లడించారు.
భూవాతావరణంలోని అధిక శక్తి గల ఎలక్ట్రాన్ల నుంచి
విడుదలయ్యే రేడియేషన్ కూడా సౌరగాలిలోని ప్రోటాన్ల మాదిరిగా పనిచేస్తుందని
అధ్యయనంలో తేలినట్లు వివరించారు.
చంద్రయాన్ -1ను ఇస్రో 2008లో ప్రయోగించింది.
ఆర్బిటర్, ఇంపాక్టర్ తో కూడిన ఈ మిషన్ 2009 వరకు పనిచేసి జాబిల్లిపై నీటి జాడలను
కనిపెట్టింది.