మహదేవ్
ఆన్లైన్ బెట్టింగ్ యాప్ నిర్వాహకుల కార్యాలయాల్లో ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు.
మనీ ల్యాండరింగ్‌తో పాటు చట్టవ్యతిరేక చర్యలకు పాల్పడుతున్నారనే ఆరోపణలతో ఈడీ
అధికారులు తనిఖీలు చేపట్టారు. కోల్‌కతా, బోపాల్, ముంబై లో సోదాలు నిర్వహించి సాక్ష్యాలను
సంపాదించారు. అలాగే లెక్కలు చూపని రూ.417 కోట్ల నగదు సీజ్ చేశారు.
ఆన్లైన్
బెట్టింగ్‌ను ప్రోత్సహించడంతో పాటు అక్రమంగా పోగు చేసిన నగదును హవాలా మార్గంలో
మళ్ళించినట్లు ఈడీ దర్యాప్తులో తేలింది. బినామీ బ్యాంకు ఖాతాలు తెరవడం నుంచి
బెట్టింగ్ చేసేందుకు వెబ్సైట్ లో యూజర్ ఐడీ, పాస్ వర్డ్స్ తయారు చేయడం వరకు
మహదేవ్ యాప్ నిర్వాహకులు చేస్తున్నట్లు విచారణలో తేలింది.
ఛత్తీస్‌గఢ్
రాష్ట్రంలోని భిలాయ్‌కు చెందిన సౌరభ్ చంద్రశేఖర్, రావి ఉప్పల్ యాప్ ప్రధాన
నిర్వాహకులుగా ఉన్నారని, దుబాయి కేంద్రంగా కార్యకలాపాలకు పాల్పడుతున్నారని ఈడీ
పేర్కొంది.
కొత్త
వారిని బెట్టింగ్ వైపు ఆకర్షించేందుకు వెబ్సైట్లలో ప్రకటనలు ఇవ్వడంతో పాటు
పెద్దమొత్తంలో నగదును విదేశీ బ్యాంకులకు మళ్లించి సొమ్ము చేసుకున్నారని
పేర్కొన్నారు.
ఛత్తీస్‌గఢ్‌లో తనిఖీలు నిర్వహించిన ఈడీ అధికారులు,
బెట్టింగ్ సిండికేట్ లో కీలకంగా వ్యవహరిస్తున్న నలుగురిని అరెస్టు చేశారు. దేశ
వ్యాప్తంగా 39 చోట్ల సోదాలు నిర్వహించి రూ. 417 కోట్ల నగదు సీజ్ చేశారు. తదుపరి
విచారణను విదేశాల్లో నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. పరారీలో ఉన్న నిందితులను
పట్టుకునేందుకు పీఎంఎల్ఏ కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది