సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ 2023 వేడుకకు
సర్వం సిద్ధమైంది. దుబాయ్లో నేడు, రేపు దక్షిణ భారత సినీ అవార్డుల పండుగ జరగబోతోంది.
దక్షిణాదికి చెందిన తెలుగు, తమిళ, మళయాళ, కన్నడ భాషా చిత్రాలకు ఈ అవార్డులు
ప్రదానం చేస్తారు.
తెలుగు నుంచి ఈ అవార్డుల రేసులో ఎవరెవరున్నారో
చూద్దాం.
ఉత్తమ నటుడు కేటగిరీలో అడవి శేష్ (మేజర్), జూ.ఎన్టీఆర్, రామ్ చరణ్ (ఆర్ఆర్ఆర్), దుల్కర్ సల్మాన్ (సీతారామం), నిఖిల్
సిద్దార్ద్ (కార్తికేయ2), సిద్ధు జొన్నలగడ్డ (డీజేటిల్లు)
పోటీ పడుతున్నారు.
ఉత్తమ నటి కేటగిరీలో మీనాక్షి చౌదరి (హిట్2),
మృణాళ్ ఠాకూర్ (సీతారామం), నేహా శెట్టి (డీజే టిల్లు), నిత్యా మీనన్ (భీమ్లా
నాయక్), సమంత (యశోద), శ్రీలీల (ధమాకా) రేసులో ఉన్నారు.
ఉత్తమ
దర్శకుడు కేటగిరీలో రాజమౌళి (ఆర్ఆర్ఆర్), హను రాఘవపూడి (సీతారామం),
చందూ మొండేటి (కార్తికేయ 2), శశికిరణ్
తిక్కా (మేజర్), విమల్ కృష్ణ (డీజే టిల్లు) నామినేట్ అయారు.
ఉత్తమ
గేయ రచయిత కేటగిరీలో చంద్రబోస్ (నాటు నాటు, ఆర్ఆర్ఆర్), కృష్ణకాంత్ (ఇంతందం,సీతారామం),
రామజోగయ్య శాస్త్రి (లాహే లాహే, ఆచార్య), సుద్దాల అశోక్ తేజ (కొమురం భీముడో, ఆర్ఆర్ఆర్) పోటీ పడుతున్నారు.
ఉత్తమ సహాయ నటి కేటగిరీలో అక్కినేని
అమల (ఒకే ఒక జీవితం), ప్రియమణి (విరాట పర్వం), సంయుక్త మీనన్ (భీమ్లా నాయక్), సంగీత
(మసూద), శోభిత ధూళిపాళ (మేజర్) రేసులో ఉన్నారు.
ఉత్తమ విలన్ కేటగిరీలో సత్యదేవ్
(గాడ్ ఫాదర్), జయరామ్ (ధమాకా), సముద్రఖని (సర్కారు వారి పాట), సుహాస్ (హిట్-2) పోటీ పడుతున్నారు.