స్టాక్ సూచీలు దూకుడుమీదున్నాయి. రెండో వారాంతంలోనూ స్టాక్ మార్కెట్లు లాభాలతో ముగిశాయి. ఉదయం లాభాలతో ప్రారంభమైన స్టాక్ సూచీలు సాయంత్రం ట్రేడింగ్ ముగిసే సమయానికి జీవిత కాల గరిష్ఠాలను రికార్డు చేశాయి. దేశీయ, అంతర్జాతీయంగా సానుకూల వాతావరణం నెలకొనడంతో స్టాక్ మార్కెట్లు పరుగులు పెడుతున్నాయి. వరుసగా 11వ రోజూ స్టాక్ మార్కెట్లు లాభాల జోరుకొనసాగించాయి.
ఉదయం లాభాలతో ప్రారంభమైన సెన్సెక్స్, ట్రేడింగ్ ముగిసే సమయానికి 319 పాయింట్లు లాభపడి 67838 వద్ద ముగిసింది. నిఫ్టీ 89 పాయింట్లు పెరిగి 20192 వద్ద ముగిసింది. రూపాయి మరింత బలహీన పడింది. డాలరుతో రూపాయి మారక విలువ 83.13గా ఉంది.
సెన్సెక్స్ 30 సూచీలో టాటా మోటార్స్, టెక్ మహీంద్రా, హెచ్డిఎఫ్సి బ్యాంక్, టీసీఎస్, భారతీ ఎయిర్టెల్, యాక్సిస్ బ్యాంక్, నెస్లే ఇండియా, సన్ ఫార్మా, ఐసీఐసీఐ బ్యాంక్ షేర్లు లాభాల్లో ముగిశాయి. కోటక్ మహీంద్రా బ్యాంక్, టైటన్, ఏషియన్ పెయింట్స్, బజాజ్ ఫిన్సర్వ్, హెచ్యూఎల్, ఇండస్ఇండ్ బ్యాంక్, పవర్ గ్రిడ్ నష్టాలను చవిచూశాయి.