ఆసియాకప్-2023లో
భాగంగా పాకిస్తాన్‌తో జరిగిన ఉత్కంఠ
పోరులో శ్రీలంక విజయం సాధించింది. సూపర్-4 మ్యాచ్ లో శ్రీలంక, పాకిస్తాన్
మధ్య జరిగిన పోరులో తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ జట్టు నిర్ణీత 42 ఓవర్లకు 7
వికెట్లు కోల్పోయి 252 పరుగులు చేసింది.
అనంతరం
శ్రీలంక బ్యాటింగ్‌కు దిగగా వర్షం పలుమార్లు అంతరాయం కలిగించింది. రాత్రి ఒంటి గంట
వరకు మ్యాచ్ కొనసాగింది. నరాలు తెగే ఉత్కంఠ మధ్య చివరి బంతికి విజయం సాధించి ఆసియాకప్-2023
ఫైనల్‌కు శ్రీలంక అర్హత సాధించింది.
ఈ విజయంతో ఆసియాకప్ లో 11వ సారి ఫైనల్ కు
చేరింది. దీంతో భారత్‌తో ఆదివారం జరగనున్న ఫైనల్ లో శ్రీలంక తలపడనుంది.
వర్షం
కారణంగా 42 ఓవర్లకు కుదించిన పోరులో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్
నిర్ణీత ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 252 పరుగులు చేసింది.
వికెట్
కీపర్ బ్యాటర్ మహమ్మద్ రిజ్వాన్ 86 పరుగులతో నాటౌట్‌గా ఉన్నారు. అబ్దుల్లా షఫీఖ్ (52,
3 ఫోర్లు, 2 సిక్సర్లు), ఇఫ్తికార్ అహ్మద్(47, 4 ఫోర్లు, 2 సిక్సర్లు)
ఆకట్టుకున్నారు.
అనంతరం
లక్ష్యఛేదనలో లంక సరిగ్గా 42 ఓవర్లలో 8 వికెట్లకు 252 పరుగులు చేసింది. అయితే డక్‌వర్త్
లూయిస్ పద్ధతి ప్రకారం శ్రీలంకను విజయం వరించింది. కుషాల్ మెండిస్(91), సమరవిక్రమ(48),
అసలంక(49 నాటౌట్) శ్రీలంకను విజయం వైపు నడిపించడంలో కీలక పాత్ర పోషించారు.