ఉమ్మడి చిత్తూరు జిల్లాలో రోడ్లు నెత్తురోడాయి. చిత్తూరు జిల్లా తెల్లగుండ్లపల్లి వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు చనిపోయారు. తవనంపల్లి మండలం తెల్లగుండ్లపల్లి వద్ద పాల వ్యాన్ను అంబులెన్స్ ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. క్షతగాత్రులను సమీప ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని క్షతగాత్రులను ఆసుపత్రులకు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మరో ప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు. అన్నమయ్య జిల్లా పీలేరు సమీపంలోని కె.వి.పల్లి మండలం మఠంపల్లి క్రాస్ వద్ద శుక్రవారం తెల్లవారుజామున లారీ, తుఫాన్ వాహనం ఢీ కొన్నాయి. ఈ ఘటనలో కర్ణాటకలోని బెల్గాంకు చెందిన ఐదుగురు చనిపోయారు. తుఫాన్ వాహనం డ్రైవర్ హనుమంతుతో పాటు మరో నలుగరు మృతి చెందారు. మృతుల్లో ముగ్గురు మహిళలు కూడా ఉన్నారు. ఈ ప్రమాదంలో మరో ఆరుగురి గాయాలయ్యాయి. ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు.