క్రికెట్
అభిమానులకు రిలయెన్స్ జియో సినిమా శుభవార్త చెప్పింది. ఈ నెల 22, 24, 27 తేదీల్లో
ఆస్ట్రేలియాతో భారత్ తలపడే మూడు మ్యాచ్‌ల
వన్డే సిరీస్‌ను జియో సినిమా ఉచితంగా ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నట్లు
ప్రకటించింది. హిందీ, ఇంగ్లిషుతో పాటు మరాఠీ, గుజరాతీ, బెంగాలీ, భోజ్‌పురి, పంజాబీ,
తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లోనూ లైవ్ స్ట్రీమింగ్ చేయనుంది.
ఇందుకోసం
ప్రత్యేక కామెంటేటర్స్ ను కూడా ఏర్పాటు చేసుకుంది. సురేశ్ రైనా, కేదార్ జాదవ్,
ఆకాశ్ చోప్రా, అమిత్ మిశ్రా, హనుమ విహారి, కిరణ్ మోరె, అనిరుధ్ శ్రీకాంత్, శరణ్‌దీప్
సింగ్ తదితర మాజీ ఆటగాళ్లు ఉన్నారు.
సీరిస్‌లో
భాగంగా తొలి వన్డే సెప్టెంబర్ 22న మొహాలీలో రెండో వన్డే సెప్టెంబర్ 24న ఇండోర్‌లో,
మూడో వన్డే రాజ్‌కోట్ లో జరగనుంది.
భారతకాలమానం
ప్రకారం మ్యాచ్‌లు మధ్యాహ్నం 1: 30
గంటలకు ప్రారంభం అవుతాయి.
ఈ సిరీస్ ముగియగానే భారత్ లోనే వన్డే ప్రపంచ కప్
ప్రారంభం అవుతుంది.
రిలయన్స్
అనుబంధ సంస్థ వయాకామ్18 బీసీసీఐ మీడియా హక్కులను రూ.5,963 కోట్లకు దక్కించుకుంది.
సెప్టెంబర్ 22 నుంచి స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరిగే మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్
నుంచే వయాకామ్ కొత్త ప్రయాణం ప్రారంభించనుంది.
భారత్ క్రికెట్ జట్టు స్వదేశంలో ఆడే మ్యాచ్ లు
స్పోర్ట్స్ 18 ఛానల్ లో ప్రసారం కానుండగా, ఇవే మ్యాచ్‌లు జియో సినిమాలో లైవ్
స్ట్రీమింగ్ కానున్నాయి.