ఆధునిక
సాంకేతిక యుగంలో యుద్ధం చేసే పద్ధతులు పెనుమార్పులకు లోనవుతున్నాయి. భవిష్యత్తులో
యుద్ధాలు చేయాల్సి వస్తే అవి ఆటోమేటెడ్‌గా ఉండబోతున్నాయి. మానవ రహిత యుద్ధాలకు
రంగం సిద్ధమవుతోంది. గ్జెనా 5.0 అనే టాక్టికల్ కంబాట్ రోబో, మిలటరీ ఆపరేషన్స్‌లో
కొత్త శకానికి దారి తీస్తోంది.
గ్జెనా 5.0
మానవ రహిత యుద్ధ సాంకేతికతలో ఒక అద్భుతం. ఇది ఒక వ్యూహాత్మక యుద్ధ వాహనం. దీనికి కెమెరాలను
అమర్చారు. దీన్ని దూరం నుంచి ఆపరేట్ చేస్తారు. దీని ప్రత్యేకత ఏంటంటే దీనికి రకరకాల
ఆయుధాలను సైతం అమర్చవచ్చు. ఉదాహరణకి, 5.56 లైట్ మెషీన్ గన్, గ్రెనేడ్ లాంచర్లను
అమర్చి దూరం నుంచి ఆపరేట్ చేయవచ్చు. దీన్ని కేవలం ఆయుధంగా మాత్రమే కాదు, నిఘా
పరికరంగా కూడా వాడుకోవచ్చు. ఇది గంటకు 30 కిలోమీటర్ల దూరం ప్రయాణించగలదు.
గ్జెనా 5.0 విశిష్టత
ఏంటంటే దీన్ని రకరకాల యుద్ధ పరిస్థితుల్లో వినియోగించుకోవ్చు. ఇది కేవలం యుద్ధం
చేయడానికి మాత్రమే కాదు, రెస్క్యూ మిషన్స్‌లో కూడా ఉపయోగపడుతుంది. అంతేకాదు. ఇది
ఆయుధ సంపత్తిని, అత్యవసర వస్తువులను రవాణా చేయగలదు. కదనరంగంలో సంక్లిష్టమైన
చోట్లకు దేన్నయినా పంపించాలంటే ఈ రోబో ద్వారా చేరవేయవచ్చు. తద్వారా యుద్ధసమయాల్లో
కానీ, చొరబాట్లను ఎదుర్కొనే సందర్భాల్లో కానీ సమస్యాత్మక ప్రాంతాలకు సైనికులు
నేరుగా వెళ్ళవలసిన రిస్క్ తగ్గుతుంది.
గ్జెనా 5.0ను
రూపొందించిన క్లబ్ ఫస్ట్ రోబోటిక్స్ సంస్థ అధికార ప్రతినిధి, దీని గురించి కొన్ని
వివరాలు పంచుకున్నారు. ‘‘ఇదొక 500కేజీల సామర్థ్యమున్న మినీ రోబో. మన సైనికులకు పలురకాలుగా
ఉపయోగపడేలా దీన్ని డిజైన్ చేసాము. ఎడారులు, తీరప్రాంతాల వంటి సంక్లిష్టమైన ప్రదేశాల్లో
సైతం నిఘా పెట్టడం దీనితో సాధ్యమవుతుంది. ఈ రోబోను సుమారు 2 కిలోమీటర్ల దూరం నుంచి
ఆపరేట్ చేయవచ్చు. తద్వారా విలువైన మానవ ప్రాణాలను ప్రమాదంలో పెట్టే రిస్క్‌ను
గణనీయంగా తగ్గించవచ్చు’’ అని చెప్పారు.
గ్జెనా 5.0 లాంటి
రోబోటిక్ వాహనాలు ఆధునిక యుద్ధతంత్రంలో కీలకమైన పాత్ర పోషిస్తాయి. అత్యంత ప్రమాదకర
పరిస్థితుల్లో సైతం సైనికుల ప్రాణాలను ప్రమాదంలో పడేయకుండా ఈ రోబోలను ఆపరేట్
చేయవచ్చు. ఇలాంటి అడ్వాన్స్డ్ టెక్నాలజీలను అందిపుచ్చుకోవడం ప్రపంచవ్యాప్తంగా
సైనిక బలగాల్లో వస్తున్న పరివర్తనను సూచిస్తుంది. మిలటరీ ఆపరేషన్స్‌లో రోబోటిక్
సిస్టమ్స్‌ను ఇంటిగ్రేట్ చేయడం, భవిష్యత్ యుద్ధాల్లో ఆటోమేషన్‌కు పెరిగే
ప్రాధాన్యతకు సూచిక. వీటివల్ల సైనికుల ప్రాణాలకు అపాయం కలిగే అవకాశాలు తగ్గుతాయి,
కదనరంగంలో సమర్థత, ప్రభావశీలత గణనీయంగా పెరుగుతాయి.