ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఈడీ దూకుడు పెంచింది. తెలంగాణ సీఎం కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసులు జారీ చేసింది. శుక్రవారం ఢిల్లీ ఈడీ కార్యాలయంలో హాజరుకావాలని నోటీసులు పంపింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో అరుణ్ రామచంద్రపిళ్లై అప్రూవర్‌గా మారిన, మరసటిరోజే కవితకు ఈడీ నోటీసులు జారీ చేసింది. రామచంద్రపిళ్లై నిన్న ప్రత్యేక న్యాయమూర్తి వద్ద ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగానే తాజాగా మరోసారి కవితకు నోటీసులు జారీ చేశారు.
ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో అరుణ్ పిళ్లై అప్రూవర్‌గా మారారని ఈడీ అధికారులు ఇప్పటికే ప్రకటించారు. పిళ్లై ఇచ్చిన వాంగ్మూలంపై విచారణ జరపాల్సి ఉందని, హాజరుకావాలంటూ కవితకు నోటీసులు జారీ చేశారు. గతంలో విచారణ అధికారులు కవిత పేరు బలవంతంగా చెప్పించారని అరుణ్ పిళ్లై చెప్పారు. తాజాగా అప్రూవర్‌గా మారడంతో ఈడీ అధికారులు మరోసారి కవితకు సమన్లు జారీ చేశారు.