పడవ
ప్రమాదంలో 18 మంది విద్యార్థులు గల్లంతయ్యారు. ఈ విషాద ఘటన బిహార్ లోని ముజఫర్నగర్
జిల్లా పరిధిలో చోటుచేసుకుంది. మధుపూర్ ఘాట్ నుంచి నాటు పడవలో 34 మంది విద్యార్థులు,
బడికి వెళ్ళేందుకు ఉదయం భాగమతి నది దాటుతుండగా ప్రమాదం జరిగింది.
పడవ పక్కకు ఒరిగి
బోల్తా పడింది. వెంటనే అప్రమత్తమైన స్థానికులు సమీపంలోని నాటు పడవల ద్వారా విద్యార్థులను రక్షించేందుకు ప్రయత్నించారు. పలువురిని సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. నీటి ప్రవాహం
ఎక్కువగా ఉండటంతో 18 మంది విద్యార్థుల జాడ
దొరకలేదు. వారి కోసం ముమ్మరంగా గాలింపు
చర్యలు చేపట్టారు.
ఈ
దుర్ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి నితీశ్ కుమార్, జిల్లా
ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. విద్యార్థుల కుటుంబాలకు అండగా నిలిచి
అవసరమైన సాయం అందజేయాలని ఆదేశించారు.
పడవ
ప్రమాదం ఘటనతో స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి. బాధిత కుటుంబ సభ్యులు నది
వద్దకు చేరుకుని కన్నీరుపెడుతున్న దృశ్యాలు కలిచివేస్తున్నాయి. ఎన్డీఆర్ఎఫ్
బృందాలు గాలింపు చర్యల్లో తీవ్రంగా శ్రమిస్తున్నాయి.