విశ్వంలో
మానవులు, జీవజాతులతో పాటు గ్రహాంతరవాసులు కూడా ఉన్నారని మెక్సికోకు చెందిన ఓ పరిశోధక
జర్నలిస్ట్, ఆ దేశ చట్ట సభ్యుల ముందు వాటి
తాలూకా సాక్ష్యాలను ప్రదర్శించారు.
చిన్న
సైజు అస్థిపంజరాలు రెండింటిని ప్రత్యేక బాక్సుల్లో తీసుకొచ్చిన సదరు వ్యక్తి, వాటి
చేతులకు మూడే వేళ్ళు ఉండటంతో పాటు పొడవైన తలభాగం కలిగి ఉండటాన్ని
ప్రస్తావిస్తున్నారు.
వీటిని పెరూలోని పురాతన నజ్కా ప్రాంతం సమీపంలో సేకరించినట్లు
తెలిపారు. కార్బన్ డేటింగ్ విధానం ద్వారా వాటి వయస్సు వెయ్యి ఏళ్ళు ఉంటుందని
నిర్ధారించినట్లు కూడా పేర్కొన్నారు.
గతంలోనూ
ఇలాంటి ఘటనలు వెలుగుచూసినప్పటికీ వాటిని చిన్నారి మమ్మీలుగా భావించారు.
మొదటి
సారి గ్రహాంతరవాసుల కదలికలకు సంబంధించిన కీలక సాక్ష్యాలను సేకరించామని, శాస్త్రీయ
ఆధారాలతోనే తాము మాట్లాడుతున్నామని తెలిపారు. ప్రపంచంలోని జీవజాతులకు సంబంధించిన
ఆనవాళ్ళు అయితే ఇవి కాదని ఖరాఖండీగా చెప్పగల్గుతామని వాదిస్తున్నారు.
విశ్వంలో
మనం ఏకాకులం కాదని ఆయన పదే పదే గుర్తు చేస్తున్నారు.
మెక్సికో
జాతీయ శాస్త్రీయ పరిశోధన సంస్థ, సదరు అస్థి పంజరాల వయస్సు అంచనా వేసే ప్రక్రియ
ప్రారంభించింది. అప్పుడు మాత్రమ ఓ నిర్ధారణకు రాగలమని వెల్లడించింది.
సుదీర్ఘ
చర్చలు, మరిన్ని ఆధారాలు లభించిన తర్వాతే ఏలియన్స్ ఉనికిపై స్పష్టత వచ్చే
అవకాశముంది.
నాసాతో
పాటు కొన్ని అగ్రదేశాలు కూడా ఏలియన్స్ ఉనికిని తెలుసుకునేందుకు ముమ్మర పరిశోధనలు
చేస్తున్నాయి.
సంక్షోభం నుంచి గట్టెక్కించండి : 16వ ఆర్థిక సంఘం ఛైర్మన్‌తో సీఎం చంద్రబాబు భేటీ