అమెరికాలో
తెలుగు విద్యార్థి దుర్మరణంపై ఆ దేశ
పోలీసు అధికారి చులకనగా మాట్లాడటాన్ని భారత దౌత్య అధికారులు ఖండించారు. సదరు
పోలీసు అధికారి బాడీ కెమెరాలో రికార్డైన దృశ్యాలపై దర్యాప్తు చేపట్టాలని కోరారు.
23
ఏళ్ళ జాహ్నవి కందుల పీజీ చదువు కోసం అమెరికా వెళ్ళారు. నార్త్ ఈస్టర్న్ సియోటల్
క్యాంపస్ విద్యార్థిగా ఉన్నారు.
ఈ ఏడాది జనవరి 23న ఆమె రోడ్డుపై వెళుతున్న సమయంలో
పోలీసు వాహనం ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడి మరణించింది. పోలీసు అధికారి కెవిన్ డేవ్
ఆ సమయంలో వాహనాన్ని120 కిలోమీటర్ల వేగంతో నడుపుతున్నారని స్థానిక మీడియాలో కథనాలు
వెలువడ్డాయి.
ప్రమాద ఘటనకు సంబంధించిన వీడియోను సియోటల్
పోలీసులు విడుదల చేయగా, అందులో ఓ పోలీసు అధికారి వేళాకోళంగా ప్రవర్తించాడు.
మరణించింది సాధారణ వ్యక్తే అంటూ బిగ్గరగా నవ్వాడు. చిన్న వయస్సులో ఆమె
చనిపోవడాన్ని కూడా హేళనగా మాట్లాడినట్లు వీడియో క్లిప్‌లో తెలుస్తోంది.
దీనిపై
అమెరికాలోని భారత దౌత్యఅధికారులు తీవ్రంగా స్పందించారు. సదరు అధికారి బాధ్యత రాహిత్యంతో
పాటు అనవసరపు ప్రేలాపనలపై చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. బాధ్యులపై
చట్టపరమైన చర్యలు డిమాండ్ చేస్తూ శాన్ఫ్రాన్సిస్కోలోని
భారత దౌత్యకార్యాలయం ప్రకటన విడుదల చేసింది.
కర్నూలు
జిల్లా ఆదోనికి చెందిన జాహ్నవి, పీజీ చదివేందుకు అమెరికా వెళ్ళారు. యూనివర్సిటీ
నుంచి తాను ఉంటున్న నివాసానికి వెళుతుండగా పోలీసు వాహనం ఢీకొట్టడంతో అక్కడికక్కడే
చనిపోయింది.
సంక్షోభం నుంచి గట్టెక్కించండి : 16వ ఆర్థిక సంఘం ఛైర్మన్‌తో సీఎం చంద్రబాబు భేటీ