స్టాక్ మార్కెట్లు లాభాలతో ప్రారంభం అయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లలో మిశ్రమ ఫలితాలు వచ్చినా…దేశీయ సూచీలు సానుకూలంగా స్పందించాయి. నిఫ్టీ, సెన్సెక్స్ రెండూ జీవిత కాల గరిష్ఠాలను రికార్డు చేశారు. సెన్సెక్స్ 234 పాయింట్ల లాభంతో 67701, నిఫ్టీ 73 పాయింట్ల లాభంతో 20143 వద్ద ప్రారంభం అయ్యాయి. రెండు సూచీలూ ఆరంభంలోనే జీవితకాల గరిష్ఠాలను నమోదు చేశాయి.
సెన్సెక్స్ 30లో టాటా స్టీల్, టెక్ మహీంద్రా, విప్రో, టీసీఎస్, పవర్ గ్రిడ్, ఎస్బిఐ, ఇన్ఫోసిస్, ఇండస్ బ్యాంక్, టాటా మోటార్స్ కంపెనీల షేర్లు లాభాలార్జించాయి. అల్ట్రాటెక్ సిమెంట్స్, ఐటీసీ షేర్లు నష్టాలను చవిచూశాయి. విదేశీ పెట్టుబడిదారులు బుధవారం నాడు ఒక్క రోజే రూ.1631 కోట్ల విలువైన షేర్లు కొనుగోలు చేశారు. ఇక దేశీయ ఇన్వెస్టర్లు రూ.849 కోట్ల పెట్టుబడులు పెట్టారు.