మెడిసిన్ చేయాలనే లక్ష్యంతో నీట్ పరీక్షకు
సిద్ధమవుతున్న 16ఏళ్ళ బాలిక ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన రాజస్థాన్
కోటాలో చోటు చేసుకుంది.
మృతురాలిని రిచాసింగ్గా గుర్తించినట్లు విజ్ఞాన్ నగర్ పోలీస్ స్టేషన్ అధికారి దేవేష్ భరద్వాజ్ వెల్లడించారు.
రిచాసింగ్ జార్ఖండ్‌లోని రాంచీ నుంచి వచ్చింది. కోటాలో ఎలక్ట్రానిక్ కాంప్లెక్స్
వద్ద ఒక హాస్టల్లో ఉంటూ ఆలిండియా మెడికల్ ఎంట్రన్స్ ఎగ్జామ్‌కు ఒక కోచింగ్ సెంటర్లో
ప్రిపేర్ అవుతుండేది. మంగళవారం రాత్రి తన గదిలో ఆత్మహత్య చేసుకున్నట్టు తెలుస్తోంది.
ఈ సంవత్సరం కోటాలో చోటుచేసుకున్న ఇలాంటి
ఆత్మహత్యల్లో ఇది 23వదని పోలీసులు వెల్లడించారు.
నానాటికీ పెరుగుతున్న విద్యార్ధుల ఆత్మహత్యల
నేపథ్యంలో రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ఇటీవలే ఒక కమిటీ ఏర్పాటు చేసారు.
ఆ కమిటీ త్వరలో తన నివేదిక ప్రభుత్వానికి సమర్పించాల్సి ఉంది.