కొద్ది నెలల కిందట అమెరికాలో కర్నూలు జిల్లా ఆదోనికి చెందిన తెలుగు విద్యార్ధిని దుర్మరణం పాలయ్యాయి. అమెరికా రాజధాని వాషింగ్టన్లో రోడ్డు దాటుతుండగా పోలీసు వాహనం ఢీకొన్ని విద్యార్థిని చనిపోయిన సంగతి తెలిసిందే. ఆ ఘటన గురించి పోలీసు అధికారి నవ్వుకుంటూ, జోకులేసుకుంటూ మాట్లాడిన వీడియో వైరల్గా మారింది. పోలీసుల బాడీకి పెట్టుకున్న కెమెరాలో ఆ వీడియో, ఆడియో రికార్డైంది. విద్యార్ధిని మృతిపట్ల అమెరికా పోలీసులు వ్యవహిరించిన తీరు వివాదాస్పదం అయింది. పోలీసు అధికారి తీరుపై ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు.
పోలీసు అధికారి డేనియల్ అడెరెర్ ఘటన గురించి మాట్లాడటం రికార్డైన వీడియోలో వినిపించింది. రోడ్డు ప్రమాదంలో చనిపోయింది ఓ సాధారణ వ్యక్తి అంటూ, అంత విలువ ఇవ్వాల్సిన అవసరం లేదంటూ పగలబడి నవ్వుతూ చెప్పిన వీడియో వైరల్ అయింది. దీంతో సియాటిల్ కమ్యూనిటీ పోలీస్ సీరియస్గా తీసుకుంది. డేనియల్ తీరుపై విచారణకు ఆదేశిస్తున్నట్టు ఉన్నతాధికారులు తెలిపారు.
కర్నూలు జిల్లా ఆదోనికి చెందిన విద్యార్ధిని జాహ్నవి ఉన్నత చదువుల కోసం 2021 సెప్టెంబరులో అమెరికాలో అడుగు పెట్టారు. కళాశాల నుంచి తిరిగి వస్తుండగా రోడ్డు దాటుతోన్న సమయంలో పోలీస్ పెట్రోలింగ్ వాహనం ఢీ కొట్టడంతో తీవ్ర గాయాలై జాహ్నవి చనిపోయారు. పోలీసు బాడీకి పెట్టుకున్న కెమెరాలో రికార్డైన వీడియో,ఆడియో ఆలస్యంగా వెలుగులోకి రావడంతో మరోసారి జాహ్నవి రోడ్డు ప్రమాదం ఘటన వార్తల్లో నిలిచింది.