రాజస్థాన్‌లోని భరత్‌పూర్‌లో ఈ
తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో 12మంది మరణించారు. మరో 12 మందికి
గాయాలయ్యాయి.
రాజస్థాన్‌లోని పుష్కర్ నుంచి
ఉత్తరప్రదేశ్‌లోని బృందావనానికి ఒక బస్సు వెడుతోంది. ఈ తెల్లవారుజామున సుమారు 4.30
సమయంలో రాజస్థాన్‌లోని భరత్పూర్ జాతీయ రహదారి మీదుగా ప్రయాణిస్తోంది. లఖన్‌పూర్
ప్రాంతంలో ఒక బ్రిడ్జిని దాటుతున్న సమయంలో బస్సు బ్రేక్ డౌన్ అయింది. డ్రైవర్ సహా
కొందరు ప్రయాణికులు బస్సు దిగి బైటకు వచ్చి, కింద నిలబడ్డారు. అంతలో వెనుకనుంచి ఒక
ట్రక్కు వచ్చి ఈ బస్సును ఢీకొట్టింది. ఆ ప్రమాదంలో ఐదుగురు పురుషులు, ఆరుగురు
మహిళలు అక్కడికక్కడే చనిపోయారు. ఆస్పత్రిలో మరొకరు తుదిశ్వాస విడిచారు.
‘‘బస్సుకు మరమ్మతులు చేస్తున్న సమయంలో
కొంతమంది బైట నిలబడ్డారు. మరికొందరు బస్సు లోపలే ఉన్నారు. ఆ సమయంలో ఒక ట్రక్కు
వెనుక నుంచి వచ్చి బస్సును గుద్దేసింది. దానివల్లనే తీవ్రమైన ప్రమాదం చోటు
చేసుకుంది’’ అని, భరత్పూర్ ఎస్పీ మృదుల్ కచ్ఛవా చెప్పారు.
బస్సులోని ప్రయాణికులు గుజరాత్‌కు చెందిన
వారు. గుజరాత్‌లోని భావనగర్ నుంచి బయల్దేరారు. ఇంతలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.
గాయపడిన వారిని దగ్గరలోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు, మృతదేహాలను మార్చురీకి
తరలించారు.
రాజస్థాన్ ముఖ్యమంత్రి ఈ
దుర్ఘటన బాధితులకు సంతాపం వెల్లడించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మృతుల కుటుంబాలకు
రూ 2 లక్షల పరిహారం, గాయపడిన వారికి రూ 50 వేల పరిహారం ప్రకటించారు.