ఈ నెల 20వ తేదీన ఏపీ క్యాబినెట్ సమావేశం కానుంది. వెలగపూడి సచివాలయంలోని మొదటి బ్లాక్లో సీఎం జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన ఈ సమావేశం జరగనుంది. మధ్యాహ్నం 3 గంటలకు మంత్రివర్గం భేటీ కానుంది. పలు అంశాలపై మంత్రివర్గం నిర్ణయాలు తీసుకోనుంది.ఈ నెల 21వ తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో క్యాబినెట్ బేటీ ఏర్పాటు చేశారు.
స్కిల్ స్కాంలో ప్రధాన ప్రతిపక్షనేత చంద్రబాబునాయుడు అరెస్టు తరవాత జరగబోతోన్న అసెంబ్లీ సమావేశాలు వాడి వేడిగా జరిగే అవకాశముంది. ఈ నెల 19న చంద్రబాబు బెయిల్ పిటిషన్పై హైకోర్టులో విచారణ మొదలు కానుంది. నాలుగు కేసుల్లో బెయిల్ కోసం చంద్రబాబు తరపు న్యాయవాదులు హైకోర్టులో పిటిషన్లు వేసిన సంగతి తెలిసిందే.