స్కిల్ డెవలప్మెంట్ కేసులో మాజీ సీఎం చంద్రబాబునాయుడు తరపు న్యాయవాదులు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్పై విచారణను హైకోర్టు మంగళవారానికి వాయిదా వేసింది. చంద్రబాబు తరపు న్యాయవాదులు వేసిన పిటిషన్పై కౌంటర్ వేసేందుకు తమకు సమయం కావాలని సీఐడీ కోరడంతో హైకోర్టు అంగీకరించింది. దీంతో విచారణ వచ్చే మంగళవారానికి వాయిదా వేశారు.
చంద్రబాబును ఐదు రోజుల పాటు తమకు కస్టడీకి ఇవ్వాలంటూ సీఐడి విజయవాడ ఏసీబీ కోర్టులో వేసిన పిటిషన్పై ఈ నెల 18 వరకు విచారణ చేపట్టవద్దని హైకోర్టు ఆదేశించింది. ఇక అమరావతి రింగ్ రోడ్డు అలైన్మెంట్ అవినీతి కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్పై విచారణను ఈ నెల 19కి వాయిదా వేసింది. దీంతో రాజమండ్రి కేంద్ర కారాగారంలో ఉన్న చంద్రబాబుకు కస్టడీ కొనసాగనుంది.