ఆసియా కప్ సూపర్ 4లో శ్రీలంక జట్టుపై భారత్ అతి కష్టం మీద విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ 213 పరుగులకు ఆలౌట్ అయింది. 214 పరుగుల విజయలక్ష్యంతో బరిలో దిగిన లంకను బౌలర్లు చిత్తుచేశారు. 41.3 ఓవర్లకే శ్రీలంక ఆలౌట్ అయింది. లంక జట్టు 172 పరుగులు చేసింది. దీంతో భారత జట్టు 41 పరుగుల ఆధిక్యంతో విజయం సాధించింది. భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్ 4, బుమ్రా, జడేజా రెండు వికెట్లు చొప్పున తీశారు.
తొలుత బ్యాటింగ్ చేసిన భారత్, ప్రారంభంలో దాటిగా ఆడిగా చివర్లో ఆటగాళ్ల తడబడ్డారు. దీంతో 213 పరుగులకే ఆలౌట్ అయ్యారు. చేధనకు బరిలో దిగిన శ్రీలంక జట్టుకు బుమ్రా షాకిచ్చాడు. లంక ఓపెనర్లు నిశాంక 6 పరుగులకు ఔట్ చేశారు. మెండీస్ 15 పరుగులు, కరుణరత్నె 2 పరుగులకే ఔటర్యారు. శ్రీలంక 25 పరుగులకే మూడు కీలక వికెట్లు కోల్పోయింది. ఆ తరవాత బరిలోకి దిగిన అసలంక 21, సమరవిక్రమ 17 పరుగులతో నిలదొక్కుకునే ప్రయత్నం చేసినా ఫలించలేదు. కుల్దీప్ వరుస ఓవర్లలో ఇద్దరిని ఔట్ చేశాడు. 99 పరుగులకే లంక 6 వికెట్లు కోల్పోయి కష్టాల్లో కూరుకుపోయింది. తరవాత వచ్చిన వెల్లలాగె, ధనంజయ జట్టును కొంత మేర ఆదుకున్నా ఫలితం దక్కలేదు. లంకపై విజయంతో భారత్కు ఫైనల్స్ బెర్త్ ఖరారైంది.