విమానంలో
సాంకేతిక లోపం వల్ల రెండు రోజులు ఢిల్లీలో చిక్కుకుపోయిన కెనడా ప్రధానమంత్రి
జస్టిన్ ట్రూడో, ఎట్టకేలకు స్వదేశానికి బయల్దేరారు.
జి-20
సమావేశాల కోసం భారత్ వచ్చిన కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో, తన అధికారిక విమానంలో
సాంకేతిక సమస్యల కారణంగా ఢిల్లీలోనే ఉండిపోవలసి వచ్చింది. నిజానికి ఆదివారం రాత్రి
బయల్దేరాల్సి ఉన్న ట్రూడో, విమానంలో లోపం వల్ల ఈరోజు మంగళవారం మధ్యాహ్నం వరకూ
ఇక్కడే ఉండిపోయారు. ఢిల్లీలోని హోటల్ రూం నుంచే పని చేసుకున్నారు.
కెనడా
ప్రధాని కార్యాలయం ప్రెస్ సెక్రెటరీ మహమ్మద్ హుసేన్ ఇవాళ తమ ప్రధాని ప్రయాణం
వివరాలు వెల్లడించారు. ‘‘విమానంలో సాంకేతిక లోపాన్ని పరిష్కరించారు. విమానానికి
ఎగరడానికి అనుమతి లభించింది. కెనడా బృందం ఈ మధ్యాహ్నం బయల్దేరుతుంది’’ అని
ప్రకటించారు.
భారత
ప్రధానమంత్రి తరఫున, ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ సహాయమంత్రి రాజీవ్ చంద్రశేఖర్, కెనడా
ప్రధానికి వీడుకోలు పలికారు.