స్కిల్ స్కాంలో ఆరోపణలు ఎదుర్కొంటూ రాజమండ్రి జైలులో రిమాండులో ఉన్న చంద్రబాబును హౌజ్ కస్టడీకి అనుమతించాలంటూ వేసిన పిటిషన్ను విజయవాడ ఏసీబీ కోర్టు కొట్టివేసింది. చంద్రబాబు తరపున సుప్రీంకోర్టు కౌన్సిల్ సిద్దార్ధ లూథ్రా వాదించారు. వారి వాదనలను కోర్టు తోసిపుచ్చింది. సీఐడీ తరపును ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించారు. రాజమండ్రి జైలులో చంద్రబాబుకు అన్ని రక్షణ ఏర్పాట్లు చేశామని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఏఏజీ వాదనలు విన్న ఏసీబీ కోర్టు ఇవాళ తీర్పు వెలువరించింది. చంద్రబాబు హౌజ్ కస్టడీ పిటీషన్ను తిరస్కరించింది.
చంద్రబాబుపై గతంలో నమోదైన నాలుగు కేసుల్లో బెయిల్ పిటిషన్లు వేశారు. స్కిల్ స్కాం కేసు, విజయనగరం రామతీర్థం వద్ద నమోదైన కేసుతోపాటు, అమరావతి ఇన్నర్రింగురోడ్డు కేసు, ఇటీవల చిత్తూరు జిల్లా పుంగనూరు అంగళ్లు వద్ద అల్లర్ల కేసులో బెయిల్ కోసం చంద్రబాబు తరపు న్యాయవాదులు పిటిషన్ వేశారు.