రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్లో ఉన్న మాజీ
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భద్రత గురించి తెలుగుదేశం పార్టీ నాయకులు అనుమానాలు
వ్యక్తం చేస్తుండడంపై హోంమంత్రి తానేటి వనిత స్పందించారు. చట్టాలూ, జైళ్ళూ
చంద్రబాబు నాయుడు ఒక్కరి కోసం రూపొందించలేదన్నారు. జైళ్ళలో అన్నిరకాల నేరస్తులూ
ఉంటారని మంత్రి చెప్పారు. చంద్రబాబు నాయుడుకు రాజమండ్రి జైల్లో పూర్తి భద్రత
కల్పించామనీ, ఆయనకు భోజనం కూడా ఇంటి నుంచి వస్తోందనీ గుర్తు చేసారు. బాబుకు జైల్లో
మావోయిస్టుల నుంచి ఎలాంటి ఇబ్బందీ లేదని స్పష్టం చేసారు.
చంద్రబాబు నాయుడి భద్రత ప్రభుత్వం బాధ్యత అన్నారు
హోంమంత్రి తానేటి వనిత. లోకేష్, పవన్ కళ్యాణ్, బాలకృష్ణ తదితరులు బాబు భద్రత
గురించి ఆందోళన మాని తమ పని తాము చేసుకోవాలని హితవు పలికారు. ‘‘చంద్రబాబు గది
పరిసరాల్లో సీసీ కెమెరాలున్నాయి. ఆయన అనుమతి లేకుండా ఎవరూ ఆయనను కలవలేరు. ఆయన
సాదాసీదా వ్యక్తి కాదు, 14ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసారు. అలాంటి వ్యక్తిని ఏ
సాక్ష్యాలూ లేకుండా సీఐడీ అరెస్ట్ చేయదు. స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్టులో
అవినీతి జరిగిందనడానికి సాక్ష్యాలు ఉన్నందునే సీఐడీ ఆయనను అరెస్ట్ చేసింది’’ అని
చెప్పుకొచ్చారు.
‘‘రోడ్డెక్కి ప్రజలను రెచ్చగొడితే చర్యలు తప్పవు.
చంద్రబాబు ఉన్న గది పరిసరాల్లో సీసీ కెమెరాలు ఉన్నాయి. చంద్రబాబు అనుమతితోనే
ఎవరినైనా ఆయన వద్దకు పంపించడం జరుగుతుంది. చంద్రబాబు సామాన్య వ్యక్తి కాదు… 14 ఏళ్ల
సీఎం.. సాక్ష్యాలు లేకుండా అతన్ని సీఐడీ అరెస్టు చేయదు. స్కిల్ డెవలప్మెంట్
ప్రాజెక్టులో అవినీతి జరిగిందన్న సాక్ష్యాలు ఉండబట్టే ఆయన్ను సీఐడీ అరెస్టు
చేసింది’’ అని హోంమంతి పేర్కొన్నారు.
జైళ్ళలో ఉద్యోగుల కేడర్
బట్టి విధులు కేటాయిస్తారు తప్ప బంధుత్వాన్ని బట్టి కాదని తానేటి వనిత చెప్పారు. ‘‘టీడీపీ
నాయకులు కావాలనే అల్లర్లు సృష్టించాలని ప్రయత్నిస్తున్నారు. లోకేష్, పవన్ కళ్యాణ్, బాలకృష్ణ చెప్పే మాటల్లో
స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో ప్రమేయం లేదని ఉందా?పోలీసులు సంయమనంతో ఉండడంవల్ల ఏపీలో శాంతియుతంగా ఉంది.
స్కిల్ కుంభకోణంలో కేవలం చంద్రబాబు నాయుడు రిమాండ్‌కి తీసుకున్నారు. విచారణకు
చంద్రబాబు సహకరిస్తే అసలు విషయాలు బయట పడతాయి’’ అని హోంమంత్రి తానేటి వనిత
అన్నారు. తనను అరెస్ట్ చేయాలని లోకేష్ పదేపదే చెప్పనక్కర్లేదని.. నేరం రుజువైతే
అరెస్ట్ తప్పదని ఆమె స్పష్టం చేసారు.