కొలంబో వేదికగా పాకిస్థాన్‌తో జరిగిన వన్డే మ్యాచ్‌లో భారత్ ఘన విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ 356 పరుగులు చేసింది. 357 పరుగుల విజయ లక్ష్యంతో బరిలో దిగిన పాక్ 32 ఓవర్లకే చేతులెత్తేసింది. లక్ష్య చేధనలో పాక్ బోల్తా పడింది. 128 పరుగులకే 8 వికెట్లు కోల్పోయింది. చివరి ఇద్దరు ఆటగాళ్లు బరిలోకి దిగకపోవడంతో ఆల్ అవుట్‌గా ప్రకటించారు. భారత జట్టులో కులదీప్ యాదవ్ 25 పరుగులిచ్చి 5 వికెట్లు తీసి పాక్ జట్టును ఖంగు తినిపించాడు.
టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన భారత జట్టులో శుభ్‌మన్ గిల్ 58, రోహిత్ శర్మ 56 పరుగులకు వెనుతిరగడంతో అభిమానులు కొంత నిరాశకు గురయ్యారు. తరవాత బరిలో దిగిన కేఎల్ రాహుల్ 111, విరాట్ కోహ్లీ 122 పరుగులతో జట్టుకు భారీ స్కోరు చేకూర్చారు. మూడో వికెట్‌కు 233 పరుగులు జోడించారు. చాలా కాలం తరవాత వచ్చిన అవకాశాన్ని రాహుల్ చక్కగా ఉపయోగించుకున్నాడు. కోహ్లీ 47వ శతకం పూర్తి చేసి మరో మైలు రాయిని చేరుకున్నాడు.