ఆసియాకప్
సూపర్-4లో భాగంగా భారత పాకిస్తాన్ జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో భారత బ్యాట్స్‌మెన్
అద్భుతంగా రాణించారు. కేవలం 2 వికెట్లు మాత్రమే కోల్పోయి 356 పరుగులు చేసారు. విరాట్
కోహ్లి, కేఎల్ రాహుల్ ఇద్దరూ సెంచరీలు చేసి 233 పరుగుల భాగస్వామ్యం నమోదు చేసారు. మూడో
వికెట్‌కు 233 పరుగుల భాగస్వామ్యం ఆసియాకప్ చరిత్రలోనే అత్యధికం.
శ్రీలంకలోని
కొలంబోలో భారత పాకిస్తాన్ మ్యాచ్ ఆదివారం మొదలైంది. భారత్ తొలుత బ్యాటింగ్
ప్రారంభించింది. అయితే వర్షం కారణంగా మ్యాచ్ 24.1 ఓవర్లు మాత్రమే ఆడగలిగారు.
అప్పటికి కెప్టెన్ రోహిత్ శర్మ 56 పరుగులు, శుభ్‌మన్ గిల్ 58 పరుగులు చేసి ఔట్
అయ్యారు. విరాట్ కోహ్లి 8 పరుగులు, కె ఎల్ రాహుల్ 17 పరుగులు చేసారు. ఆ దశలో
మ్యాచ్ నిలిచిపోయింది. రిజర్వ్ డే అయిన సోమవారానికి వాయిదా పడింది.
ఇవాళ కూడా
మ్యాచ్ మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభించాల్సి ఉండగా వాతావరణం బాగోలేక 4.40కి
మొదలైంది. మ్యాచ్‌ను పూర్తిగా నిర్వహించడానికే అంపైర్లు నిర్ణయం తీసుకున్నారు.
దాంతో భారత్ బ్యాటింగ్ ప్రారంభించింది.
విరాట్
కోహ్లీ, కెఎల్ రాహుల్ ఇద్దరూ నిలకడగా ఆడుతూ పాక్ బౌలర్లను ముప్పుతిప్పలు పెట్టారు.
25.5 ఓవర్ల పాటు క్రీజ్‌లో నిలబడ్డారు. పాక్ బౌలర్లు ఎంత కట్టుదిట్టంగా బౌలింగ్
చేసినా వారిని ఔట్ చేయలేకపోయారు. రాహుల్, కోహ్లీ ఇద్దరూ సెంచరీలు పూర్తి చేసారు.
విరాట్ కోహ్లీ తన కెరీర్లో 47వ సెంచరీ చేసాడు. అలాగే, వన్డేల్లో 13వేల పరుగులు
పూర్తిచేసుకున్నాడు. వన్డే హిస్టరీలో అత్యంత వేగంగా 13వేల పరుగులు సాధించిన
రికార్డు సొంతం చేసుకున్నాడు.
మ్యాచ్
50 ఓవర్లు ముగిసేసరికి విరాట్ కోహ్లీ 122 పరుగులు, కేఎల్ రాహుల్ 111 పరుగులతో
నాటౌట్‌గా ఉన్నారు.