ప్రజలు,
రాష్ట్రం, దేశం మినహా వేరే ఏం ఆలోచించని వ్యక్తి చంద్రబాబు నాయుడు అని టీడీపీ
జాతీయ కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు. ఉద్యోగాలు, పరిశ్రమలు, అభివృద్ధి గురించే
ఎప్పుడూ ఆలోచిస్తారని చెప్పారు. ప్రజా సంక్షేమానికి కృషి చేయడమే గానీ అవినీతి
చేయడం తమ కుటుంబ రక్తంలోనే లేదన్నారు. దేశ రాజకీయాల్లో అరుదైన గుర్తింపు పొందిన
వ్యక్తి చంద్రబాబు అని, అలాంటి వ్యక్తిపై దొంగ కేసు పెట్టి అరెస్టు చేశారని ఆగ్రహం
వ్యక్తం చేశారు.
చంద్రబాబు అంటేనే ఓ బ్రాండ్ అని బిల్గేట్స్, క్లింటన్,
ఫార్చూన్ 500 సీఈవోలు చెబుతారని లోకేశ్
అన్నారు.
పాముకు
తలలోనే విషం ఉంటుందన్న లోకేశ్, జగన్ కు ఒళ్ళంతా విషమే ఉందని ఘాటు విమర్శలు చేశారు.
చంద్రబాబు పై అవినీతి ఆరోపణలను ఎవరూ నమ్మడం లేదని, న్యాయం నిలబడే వరకు ఈ
ప్రభుత్వాన్ని వెంటాడుతూనే ఉంటామన్నారు.
చంద్రబాబు జోలికి రావడం, సైకో జగన్ చేసిన
అతిపెద్ద తప్పు అని, అందుకు తగిన మూల్యం రాజకీయంగా, వ్యక్తిగతంగా
చెల్లించుకుంటారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
చంద్రబాబు
పై అక్రమ కేసు పెట్టి, అరెస్టు చేయడం టీడీపీకి స్పీడ్ బ్రేకర్ మాత్రమేనని,
తెలుగుదేశం స్థాపించిన తర్వాత ఎన్నో సంక్షోభాలను ఎదుర్కొందని గుర్తు చేశారు.
ఇందిరాగాంధీ, వైఎస్సార్ పై టీడీపీ పోరాటం చేసిందని, వాళ్లతో పోలిస్తే సైకో జగన్
పెద్ద లెక్కే కాదన్నారు.
ప్రస్తుతం
యువగళం యాత్రను తాత్కాలికంగా నిలిపివేశామని, తమ అధినేతపై దాడి జరుగుతున్న సమయంలో
దానిని ఆపాల్సిన బాధ్యత తనపై ఉందన్నారు. మళ్ళీ ఎప్పుడు ప్రారంభించాలనే త్వరలో
తెలియజేస్తామన్నారు.
వైసీపీ
ప్రభుత్వంపై తన పోరాటం ఆగదని పునరుద్ఘాటాంచిన లోకేశ్.. తాను ఎక్కడికి పారిపోలేదని,
అరెస్టు చేయాలనుకుంటే వచ్చి చేసుకోండి అంటూ సవాల్ విసిరారు. జగన్ ప్రభుత్వం అంతు
తేల్చే వరకు పోరాటం కొనసాగుతుందన్నారు.
చంద్రబాబు
అరెస్టు విషయాన్ని ఖండించడంతో పాటు తమకు జనసేన అధినేత పవన్ ఓ అన్నయ్యగా అండగా
నిలిచారని తెలిపారు. పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కూడా అరెస్టు తీరును
తప్పుబట్టారన్నారు. చంద్రబాబు అరెస్టుకు నిరసన గా చేపట్టిన బంద్ కు మద్దతు తెలిపిన
సీపీఐ, జనసేన, ఎమ్మార్పీఎస్ నేతలకు లోకేశ్ ధన్యవాదాలు తెలిపారు.