బీఎండబ్ల్యూ భారత్‌లో మరో కొత్త స్పోర్ట్స్ కారును
విడుదల చేసింది. 630ఐ ఎం స్పోర్ట్ సిగ్నేచర్ పేరిట వస్తున్న కారును
భారత్‌లోనే తయారు చేసారు. చెన్నై ప్లాంట్‌లో దీన్ని ఉత్పత్తి చేస్తున్నట్లు కంపెనీ
తెలిపింది. కేవలం పెట్రోల్ వేరియంట్లో విడుదల చేసిన ఈ కారు ధర రూ.75.90 లక్షలు
మాత్రమే.
బీఎండబ్ల్యూ 630ఐ ఎం
స్పోర్ట్ సిగ్నేచర్‌లో 2-లీటర్-4-సిలిండర్ పెట్రోల్ ఇంజిన్ ఉంది. ఇది 100 కిలోమీటర్ల
వేగాన్ని కేవలం 6.5 సెకన్లలోనే అందుకుంటుంది. కీలెస్ ఎంట్రీ,
ఇన్ఫోటైన్మెంట్ టచ్‌స్క్రీన్, రిమోట్
పార్కింగ్ అసిస్ట్ ఫీచర్లు ఉన్నాయి. వెనుక సీట్లకు వేరేగా ఎంటర్టైన్మెంట్
స్క్రీన్లు ఉన్నాయి. రివర్స్ కెమెరా, అత్యాధునిక సౌండ్ సిస్టమ్ ఉన్నాయి.
ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, అన్ని సీట్లకు త్రీపాయింట్ సీట్ బెల్ట్‌లు వంటి
సేఫ్టీ ఫీచర్స్ ఈ కారు సొంతం.