జీ20 సమావేశాలు విజయవంతం చేయడంపై బాలీవుడ్ స్టార్ షారుక్ ఖాన్, ప్రధాని మోదీపై ప్రశంసల జల్లు కురిపించారు. ప్రపంచ దేశాల మధ్య శాంతిని, ఐక్యతను పెంపొందించేందుకు ప్రధాని కృషి చేస్తున్నారని షారుక్ కొనియాడారు. జీ20 విజయవంతం చేసిన ప్రధాని మోదీని ప్రశంసిస్తూ షారుక్ ట్వీట్ చేశారు.
జీ20పై ప్రధాని మోదీ చేసిన వీడియో ట్వీట్‌కు షారుక్ రీ ట్వీట్ చేశారు. జీ20కి మోదీ నాయకత్వం వహించినందుకు షారుక్ అభినందలు తెలిపారు. జీ20 శిఖరాగ్ర సమావేశాల వల్ల దేశాల మధ్య సంబంధాలు మెరుగుపడతాయన్నారు. ప్రధాని మోదీని చూసి దేశ ప్రజలంతా గర్వపడుతున్నారని షారుక్ ట్వీట్ చేశారు. మీ నాయకత్వంలో ఐకమత్యంతో అభివృద్ధి సాధిద్దామంటూ షారుక్ పోస్ట్ చేశారు. ప్రధాని మోదీ పిలుపునిచ్చిన వన్ ఎర్త్, వన్ ఫ్యామిలీ, వన్ ఫ్యూచర్ నినాదాన్ని కూడా షారుక్ ప్రస్తావించారు.