స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబుకు ఏసీబీ కోర్టు రిమాండ్ విధించింది. కోర్టు ఆదేశాలు వెలువడిన వెంటనే భారీ భద్రత మధ్య చంద్రబాబును రాజమహేంద్రవరం కేంద్రకారాగానికి తరలిస్తున్నారు.
ఇప్పటికే కోర్టు దగ్గర భారీగా మోహరించిన పోలీసులు బలగాలు, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భద్రత కల్పిస్తున్నారు. కోర్టు దగ్గర నిరసన వ్యక్తం చేసేందుకు ప్రయత్నించిన టీడీపీ నేతలను అదుపులోకి తీసుకుని పోలీసు వాహనాల్లో తరలించారు.
ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా ఇప్పటికే ముందస్తు చర్యలు తీసుకున్నారు. తీర్పు రావడానికి రెండు గంటల ముందు నుంచే కోర్టు చుట్టపక్కల మూడు కిలోమీటర్ల పరిధిని పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఈ కేసు విచారించిన న్యాయమూర్తి చంద్రబాబుకు 14 రోజుల రిమాండ్ విధించారు.