ఆసియా
కప్లో భాగంగా భారత్, పాకిస్తాన్ మధ్య జరుగుతున్న సూపర్ 4 మ్యాచ్ వర్షం కారణంగా
నిలిచిపోయింది. 24.1 ఓవర్ల వద్ద వాన మొదలు కావడంతో మైదానాన్ని ప్లాస్టిక్ కవర్లతో
కప్పేశారు. ఆట నిలిచిపోయేటప్పటికీ భారత్ జట్టు రెండు వికెట్లు కోల్పోయి 147
పరుగులు చేసింది.
విరాట్ కోహ్లీ(8), కేఎల్ రాహుల్(17) క్రీజులో ఉన్నారు.
రోహిత్
శర్మ ఔటైన తర్వాతి ఓవర్లోనే శుభ్మన్ గిల్ వెనుదిరిగాడు. రోహిత్ శర్మ 49 బంతుల్లో
56 పరుగులు చేశారు. శుభమన్ గిల్ 52 బంతుల్లో 58 పరుగులు సాధించారు.
కొలంబోలోని
ప్రేమదాస స్టేడియంలో భారత్-పాకిస్తాన్ జట్లు తలపడుతున్నాయి. టాస్ గెలిచిన
పాకిస్తాన్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ తో భారత స్టార్ బ్యాటర్ కేఎల్
రాహుల్ రీ ఎంట్రీ ఇచ్చారు. శ్రేయస్ అయ్యర్ స్థానంలో రాహుల్ తుది జట్టులో స్థానం
సంపాదించారు. బుమ్రా కూడా ప్లేయింగ్ ఎలెవన్ లోకి వచ్చారు. పాకిస్తాన్ ఎలాంటి
మార్పులు లేకుండానే బరిలోకి దిగింది.
భారత్
జట్టు: రోహిత్ శర్మ(కెప్టెన్), శుభమన్ గిల్, విరాట్
కోహ్లి, కేఎల్ రాహుల్, ఇషాన్ కిషన్(వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, రవీంద్ర
జడేజా, శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్
పాకిస్తాన్
జట్టు : ఫకర్ జమాన్, ఇమామ్ ఉల్ హక్, బాబర్ ఆజం(కెప్టెన్),
మహ్మద్ రిజ్వాన్(వికెట్ కీపర్), సల్మాన్ అలీ ఆఘా, ఫాహీమ్ ఆష్రప్, ఇఫ్తికర్ అహ్మద్,
షాదాబ్ ఖాన్, షాహిన్ అఫ్రీది, నసీం షా, హ్యారిస్ రవూఫ్.