జీ20 దేశాల శిఖరాగ్ర సమావేశాలు ముగిశాయి. ఈ సమావేశాల్లో చేసిన సిఫార్సులు, తీర్మానాల అమలును పరిశీలించడానికి నవంబరు చివరి వారంలో వర్చువల్ సమావేశం నిర్వహించాలని మోదీ జీ20 ప్రతినిధులకు పిలుపునిచ్చారు. నవంబరు చివరి వరకు జీ20కి భారత నాయకత్వమే కొనసాగుతుందని మోదీ గుర్తుచేశారు. భారత్ అధ్యక్ష హోదాలో మరో రెండు నెలలు కొనసాగే అవకాశం ఉండటంతో మరిన్ని సిఫార్సులు చేయవచ్చని ఆయన అన్నారు.
జీ20లో అంగీకరించిన అంశాలను మరోసారి సమీక్షించుకునేందుకు నవంబరులో వర్చువల్ సమావేశాలు నిర్వహించుకోవాలని మోదీ కోరారు. దీనిపై ఎలా ముందుకెళ్లాలనే దానిపై భారత దౌత్యవేత్తలు వివరిస్తారని ఆయన చెప్పారు. ప్రపంచ వ్యాప్తంగా కొత్త ఆశలు చిగురించి, శాంతి నెలకొనాలని ప్రార్థిస్తూ ప్రధాని మోదీ ఓ సంస్కృత శ్లోకాన్ని చదివి వినిపించారు. చివరగా జీ20 అధ్యక్ష బాధ్యతలను బ్రెజిల్ అధ్యక్షుడు లులా కు అప్పగించారు.