యూఎస్
ఓపెన్ టోర్నీలో మహిళల సింగిల్స్ విజేతగా
అమెరికా క్రీడాకారిణి కోకోగాఫ్ నిలిచింది. ఫైనల్ లో బెలారస్ ప్లేయర్ సబలెంకపై 2-6,
6-3, 6-2 తేడాతో విజయం సాధించి, తొలి గ్రాండ్‌స్లామ్ ను తన ఖాతాలో వేసుకుంది.
దాదాపు రెండు గంటల 6 నిమిషాల పాటు సాగిన హోరాహోరీ పోరులో సబలెంకపై తొలి సెట్ ను
కోల్పోయినప్పటికీ పుంజుకుని మరీ కోకోగాఫ్ విజయం సాధించారు.
తొలి
సెట్ లో కోకో గాఫ్ వెనకబడినప్పటికీ ఆ
తర్వాతి రెండు సెట్లలో పుంజుకుని ప్రత్యర్థిని ఓడించింది.
సెరెనా విలియమ్స్ తర్వాత
యూఎస్ ట్రోఫీని అందుకున్న అత్యంత పిన్న వయస్కురాలిగా గాఫ్ నిలిచింది.వాషింగ్టన్
సిన్సినాటి టైటిళ్ళను గెలవడంతో తన ఆత్మవిశ్వాసం
పెరిగిందని కోకో గాఫ్ పేర్కొన్నారు. ఇలాంటి అనుభవం మాటల్లో చెప్పలేనని
భావోద్వేగానికి గురయ్యారు.
గతేడాది ప్రెంచ్ ఓపెన్ తో పాటు వింబుల్డెన్ లో
ఓడిపోవడంతో తట్టుకోలేకపోయానన్న కోకో గాఫ్, తన సామర్థ్యంపై నమ్మకం లేని వారికి ఈ
సందర్భంగా ధన్యవాదాలు అంటూ నవ్వుతూ మాట్లాడారు. ఈ విజయం వెనుక తన తండ్రి ప్రోద్బలం
ఎంతో ఉందని చెప్పారు.