ఆసియా
కప్ టోర్నమెంట్ లో భాగంగా భారత్, పాకిస్తాన్ మరోసారి సమరానికి సిద్ధమవుతున్నాయి.
ఆసీయా కప్ లీగ్ దశలో రెండు జట్ల మద్య మ్యాచ్ వర్షంతో రద్దు కావడంతో ఎలాంటి ఇబ్బంది
లేకుండానే రెండు జట్లు సూపర్-4లోకి అడుగుపెట్టాయి. నేటి మధ్యాహ్నం మూడు గంటలకు కొలంబో
వేదికగా దాయాదుల మధ్య పోరు జరగనుంది.
సూపర్
4 దశలో భాగంగా ప్రేమదాస స్టేడియంలో నేడు జరిగే పోరులో ఇరు జట్లు అమీతుమీ
తేల్చుకునేందుకు సిద్ధమయ్యాయి. లీగ్ దశలో ఈ నెల2న ఇరు జట్ల మధ్య వర్షం కారణంగా
రద్దయింది. దీంతో అభిమానుల ఆసక్తి, ప్రసారకర్తల వినతి మేరకు నేటి మ్యాచ్ ను
రిజర్వ్ డే గా కేటాయించారు.
నేడు
ఉరుములు, మెరుపులతో కూడిన వాతావరణంతో వర్షం కురిసే అవకాశం ఉంది. మ్యాచ్ రిజర్వ్
డేకు వెళ్ళవచ్చు. అయితే సోమవారం కూడా ఇదే వాతావరణం ఉంటుందని అంచనా
మ్యాచ్
జరిగే ప్రాంతంలో 90 శాతం వర్ష సూచన ఉండగా, సోమవారం కూడా పరిస్థితి దాదాపు అలాగే
కనిపిస్తోంది. వాన అంతరాయం లేకుండా మ్యాచ్ ఫలితం వస్తుందా అనేది ఆసక్తికరంగా ఉంది.
కొలంబో
పిచ్ బౌలర్లకు అనుకూలం. స్పిన్నర్లకు ఎక్కువగా అనూకూలించే పిచ్. ఈ పిచ్ పై పరుగులు చేయడం కష్టసాధ్యమే. ఆసియా కప్ కు ముందు ఇక్కడ చివరి వన్డే
పాకిస్తాన్ 268 పరుగులకు పరిమితం కాగా, ఛేదనలో అప్గాన్ 208కే ఆలౌటైంది.
నేడు జరిగే మ్యాచ్ కోసం పాకిస్తాన్
లెజెండరీ క్రికెటర్ షోయబ్ అక్తర్, కొలంబో చేరుకున్నారు. వాతావరణం బాగుందని, చాలా
ఏళ్ళ తర్వాత అక్కడ అడుగుపెట్టానని సోషల్ మీడియాలో వెల్లడించారు. పాకిస్తాన్ తో
జాగ్రత్త అంటూ ఓ వార్నింగ్ కూడా ఇచ్చారు.