స్కిల్
డెవలప్మెంట్ స్కాంలో మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టుపై ఏసీబీ కోర్టులో విచారణ జరుగుతోంది. టీడీపీ
అధినేత చంద్రబాబు నుంచి న్యాయమూర్తి వాంగ్మూలం తీసుకున్నారు. తన అరెస్టు అక్రమం
అని చంద్రబాబు వాంగ్మూలంలో పేర్కొన్నారు. రాజకీయ కక్షతోనే తనపై కేసు నమోదు చేశారని
పిటిషన్ దాఖలు చేశారు.
రాజకీయ
లబ్ధి కోసమే తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని పిటిషన్ లో పేర్కొన్న చంద్రబాబు,
సీఐడీ రిమాండ్ రిపోర్టును తిరస్కరించాలని కోరారు.
గవర్నర్ అనుమతి లేకుండా కేసు
నమోదు చేయడంతో పాటు తనను అదుపులోకి తీసుకోవడం చట్టవిరుద్ధమన్నారు.
స్కిల్‌డెవలప్‌మెంట్
కార్పొరేషన్ ఏర్పాటు చేయాన్నది నాటి కేబినెట్ నిర్ణయమని, దానిపై క్రిమినల్ చర్యలు
ఎలా తీసుకుంటారన్నారు. అసెంబ్లీ ఆమోదం తెలిపిన బడ్జెట్ ను క్రిమినల్ చర్యలతో
ప్రశ్నించలేరని తెలిపారు. 2021 డిసెంబరు 9న నమోదు చేసిన ఎఫ్ఐఆర్ లోనూ రిమాండ్
రిపోర్టులోనూ తన పాత్రను పేర్కొనలేదని వివరించారు.
చంద్రబాబు
తరఫున వాదనలు వినిపించడానికి ముగ్గిరికి అవకాశం కల్పించాలని న్యాయమూర్తిని కోరగా,
ఇద్దరికి మాత్రమే జస్టిస్ హిమబిందు అవకాశం కల్పించారు. దీంతో సిద్ధార్థ లూద్రా,
పోసాని వెంకటేశ్వరరావు పేర్లు చెప్పగా న్యాయమూర్తి అనుమతి ఇచ్చారు.
409
సెక్షన్ కింద వాదనలు జరుగుతున్నాయి. దీనిపై సుప్రీంకోర్టు ప్రముఖ న్యాయవాది
సిద్ధార్థ లూద్రా వాదిస్తున్నారు. ఈ సెక్షన్ పెట్టడం సబబు కాదని, వర్తించాలంటే
సరైన ఆధారం కావాలన్నారు.
సీఐడీ
తరఫున ఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి, లాయర్లు వివేకాచారి, వెంకటేశ్
వాదిస్తున్నారు. చంద్రబాబును 15 రోజుల కస్టడీకి ఇవ్వాలని కోరింది. మొత్తం 28
పేజీలతో రిమాండ్ రిపోర్టు సమర్పించింది. చంద్రబాబు తరఫున సిద్ధార్థ లూద్రా వాదనలు
ఇంకా కొనసాగిస్తున్నారు.