మొరాకో దేశంలో పెను విషాదం చోటు చేసుకుంది. శుక్రవారం అర్ధరాత్రి సంభవించిన పెను భూకంపంలో మృతుల సంఖ్య పెరుగుతూనే ఉంది. పెను భూకంపం దాటికి 2000 మంది చనిపోయారని, 1200 గాయపడ్డారని మొరాకో ప్రభుత్వం ప్రకటించింది. గాయపడిన వారిలో 720 మంది పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్టు అధికారులు తెలిపారు.
ఉత్తర ఆఫ్రికాలోని మొరాకో దేశంలో అర్ధరాత్రి భూకంపం సంభవించడంతో మృతుల సంఖ్య పెరుగుతూనే ఉంది. వేల సంఖ్యలో భవనాలు నేలమట్టం అయ్యాయి. వేలాది గ్రామాలు ధ్వంసమయినట్టు సమాచారం అందుతోంది. రిక్టర్ స్టేలుపై భూకంప తీవ్రత 6.8గా నమోదైంది. భూకంప బాధితులకు అన్ని విధాలా భారత్ సాయం అందిస్తుందని ప్రధాని మోదీ ప్రకటించారు.