చంద్రయాన్
-3 ప్రయోగంలో భాగంగా జాబిల్లిపై అడుగుపెట్టి కీలక సమాచారాన్ని అందించి, ప్రస్తుతం నిద్రాణ
స్థితిలో ఉన్న విక్రమ్ ల్యాండర్‌ను చంద్రయాన్-2 పొటో తీసింది. చంద్రయాన్-2
ఆర్బిటర్ లోని డ్యూయల్ ఫ్రీక్వెన్సీ సింథటిక్ ఎపర్చర్ రాడార్ ద్వారా చంద్రయాన్-3
ల్యాండర్ విక్రమ్ ఫొటోను ఈ నెల 6న తీసినట్లు ఇస్రో వెల్లడించింది.
చంద్రయాన్-3
ప్రయోగంలో భాగంగా విక్రమ్ ల్యాండర్ జాబిల్లిపై అడుగుపెట్టిన తర్వాత చంద్రయాన్-2ను
కూడా దానితో అనుసంధానం చేశారు. ఇటీవల నాసా కూడా విక్రమ్ ల్యాండర్ దిగిన శివశక్తి
పాయింట్ ఫొటో తీసింది.
చంద్రయాన్-2
క్రాష్ ల్యాండైన నాలుగేళ్ల తర్వాత చంద్రయాన్ -3ను చేపట్టారు. చంద్రుడి దక్షిణ
ద్రువంపై అడుగుపెట్టిన మొదటి దేశంగా భారత్ ఘనత సాధించింది.
చంద్రుడిపై
రాత్రి ప్రారంభం కావడంతో శీతల వాతావరణ ప్రభావంతో విక్రమ్ ల్యాండర్, రోవర్ స్లీప్
మోడ్‌లోకి వెళ్ళాయి.
ఈ నెల 22న చంద్రుడిపై తిరిగి లూనార్ డే ప్రారంభమవుతుంది.
ఆరోజున సూర్యకిరణాల ప్రభావంతో మళ్ళీ ల్యాండర్, రోవర్ మేల్కొంటాయని ఇస్రో అంచనా
వేస్తోంది.
లూనార్
నైట్ సమయంలో చంద్రుడి ఉపరితలంపై ఉండే మైనస్ 200 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత వంటి
పరిస్థితులను ల్యాండర్, రోవర్ తట్టుకుని తిరిగి పనిచేస్తాయా అన్నదానిపై ఉత్కంఠత
నెలకొంది.