జీ20 సమావేశాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. 55 దేశాల ఆఫ్రికన్ యూనియన్ను జీ20 కూటమిలోకి ప్రధాని మోదీ ఆహ్వానించారు. జీ20 కూటమిలో ఆఫ్రికన్ యూనియన్ చేరడాన్ని స్వాగతిస్తున్నట్టు మోదీ ప్రకటించారు. 55 దేశాల ఆఫ్రికన్ యూనియన్ ప్రజా జీ20 కూటమిలో శాశ్విత సభ్యునిగా చేరడం ఒక మైలురాయిగా నిలిచిపోతుందని ప్రధాని కార్యాలయం ట్వీట్ చేసింది.
ఆఫ్రికన్ యూనియన్ కూటమి అధ్యక్షులు అజాలి అసోయానికి ప్రధాని మోదీ ఘన స్వాగతం పలికారు. గ్లోబల్ సౌత్ దేశాల ఆకాంక్షలను ప్రతిధ్వనించే విధంగా జీ20 దేశాలు సమగ్ర అభివృద్ధి సాధించాలని ప్రధాని ఆకాక్షించారు. ఆఫ్రికన్ యూనియన్ కమిషన్ అధినేత మౌసికా ఫకి మహమ్మద్ కూటమిలోని దేశాలను జీ20లోకి ఆహ్వానించారు. ప్రపంచ దేశాలు ఎదుర్కొంటోన్న సవాళ్లను అధిగమించడంలో, సహకారం అందించడంలో ఈ కలయిన ఆఫ్రికా ఖండానికి ఉపయోగపడుతుందని ఆయన ఆకాంక్షించారు.
జీ20 అనేది కేవలం ఆ కూటమిలోని భాగస్వాములతో మాత్రమే కాకుండా గ్లోబల్ సౌత్‌లోని దేశాలతోనూ అనేక అంశాలపై సంప్రదింపులుంటాయని ప్రధాని మోదీ గత డిసెంబరులోనే చెప్పారు. గ్లోబల్ సౌత్ అనేది ఆసియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికాలో అభివృద్ధి చెందుతున్న దేశాలను సూచించడానికి ఉపయోగించే పదం.
జీ20 సమావేశాల్లో ప్రధాని మోదీ ఆసీనులైన టేబుల్‌పై భారత్ అనే సైన్ బోర్డు ఉంచడం ఇండియా పేరు మార్పు ఊహాగానాలకు మరింత బలం చేకూర్చినట్టైంది.