స్కిల్
డెవలప్‌మెంట్ కేసులో నిక్కచ్చిగా విచారణ జరిగిన తర్వాతే చంద్రబాబు అరెస్టు
జరిగిందని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. రాజకీయ ప్రతీకారంలోభాగంగా
అరెస్టు చేయాలనకుంటే 2021 లో కేసు నమోదైనప్పుడే జరిగేదన్నారు. ఆధారాలు లభించిన తర్వాతే అరెస్టు
చేసినట్లు చెప్పారు.
చంద్రబాబు తప్పు చేయకపోతే కోర్టులో నిరూపించుకోవాలని
సూచించారు.
ఆర్థిక
నేరాల్లో అరెస్టుకు సంబంధించి నోటీసులు ఇవ్వాల్సిన అవసరం లేదన్న సజ్జల రామకృష్ణా
రెడ్డి, ప్రపంచంలోని ఓ ప్రముఖ సంస్థ పేరు చెప్పి స్కాం చేశారన్నారు.
2017లోనే
జీఎస్టీ ఇంటిలిజెన్స్ ఈ స్కాంను బయటపెట్టిందని గుర్తు చేశారు.
చంద్రబాబు
జోలికి ఎవ్వరూ వెళ్లకూడదని రాజ్యాంగంలో ఏమైనా ఉందా? అని ప్రశ్నించిన సజ్జల, అన్నింటికీ అతీతుడిననే భ్రమలను చంద్రబాబు
పక్కన పెట్టాలని సూచించారు. చంద్రబాబు
అరెస్టు అక్రమం, అన్యాయం అనే వారు స్కాం గురించి తెలుసుకుని మాట్లాడాలని హితవు
పలికారు.
రాజకీయం
అనుభవం ఉన్నంత మాత్రాన అవినీతికి పాల్పడితే అరెస్టు చేయకూడదా అని మంత్రి
పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రశ్నించారు. మొత్తం రూ. 3, 356 కోట్ల ప్రాజక్టులో 90 శాతం సీమెన్స్ కంపెనీ, 10 శాతం, అంటే రూ. 371 కోట్లు ప్రభుత్వం ఖర్చు చేయాల్సిన ప్రాజెక్టులో..
ప్రభుత్వ డబ్బును మాత్రం ఖర్చు చేయించి, రూ.
371 కోట్లు చంద్రబాబు అండ్ కో మింగేశారని ఆరోపించారు.
ఏ కారణం లేకుండా ఒక ప్రైవేటు
కంపెనీ, ప్రభుత్వం తరపున రూ. 3000 కోట్లు ఎందుకు ఖర్చు చేస్తుందని ప్రశ్నించారు. ఈ
చిన్న లాజిక్ కూడా తెలియకుండా, చంద్రబాబు
స్కామ్ చేశారన్నారు. షెల్ కంపెనీల ద్వారా, హవాలా
మార్గంలో డబ్బులు బదలాయించారన్నారు.