టీడీపీ
అధినేత చంద్రబాబు అరెస్టుపై ఏపీ సీఐడీ చీఫ్ సంజయ్ స్పందించారు. నంద్యాలలో ఉదయం ఆరు
గంటలకు చంద్రబాబును అరెస్టు చేసినట్లు తెలిపారు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో
ఆయన్ను ప్రధాన నిందితుడిగా గుర్తించినట్లు పేర్కొన్నారు.
నైపుణ్యాభివృద్ధి
కేంద్రాల ఏర్పాటులో కుంభకోణం జరిగిందని, అందులో రూ. 550 కోట్ల మేర అక్రమాలు
జరిగాయని గుర్తించినట్లు తెలిపారు. ప్రభుత్వం తన వాటాగా ఇవ్వాల్సిన రూ. 371
కోట్లు, డిజైన్టెక్ సహా ఇతర షెల్ కంపెనీలకు వెళ్ళినట్లు గుర్తించామన్నారు.
సీమెన్స్
తరఫున డిజైన్ టెక్ అనే సంస్థ ద్వారా లావాదేవీలు జరిగాయని, ఒప్పందం జరిగే సమయానికి ఆ
సంస్థే లేదన్నారు.
ఏపీ
స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో గంటా సుబ్బారావుకు నాలుగు పదవులు
ఇచ్చారన్నారు.
కేసులో
ప్రధాన నిందితుడిగా ఉన్నచంద్రబాబు, సాక్ష్యాలను మాయం చేసే అవకాశం ఉందని అందుకే
అరెస్టు చేసినట్లు తెలిపారు.
కుంభకోణంలో అప్పటి కార్యదర్శితో పాటు చంద్రబాబు
తనయుడి పాత్రపైనా దర్యాప్తు జరుగుతోందన్నారు.
సీమెన్స్
సంస్థ నుంచి రూ.550 కోట్లు పెట్టుబడి
వస్తుందని పేర్కొంటూ ప్రభుత్వం జీవోల ద్వారా రూ. 371 కోట్లు ఇచ్చేశారని, దీనికి
కేబినెట్ ఆమోదం కూడా లేదని సీఐడీ చీఫ్ తెలిపారు.
కేసు విచారణకు సంబంధించి సీఐడీ
బృందాలు దుబాయి, అమెరికాకు వెళ్తున్నాయన్నారు. ఈ కేసులో రాజేశ్, నారా లోకేశ్
పాత్రలు ఎంత ఉన్నాయన్నది తేలుస్తామన్నారు.
ఏపీ
ఫైబర్నెట్ తో పాటు ఇన్నర్ రింగ్ రోడ్డు అక్రమాల కేసులో లోకేశ్ పాత్రపైనా విచారణ
చేస్తామని తెలిపారు.
చంద్రబాబును విజయవాడ తరలించేందుకు హెలికాప్టర్ సిద్ధం చేశామని
అయితే ఆయన నిరాకరించారన్నారు. ఈ కేసులో అంతిమలబ్ధిదారు చంద్రబాబే అని ఆయన ప్రధాన కుట్రదారు ి కాబట్టే అరెస్టు చేశామని తెలిపారు.