స్కిల్
డెవలప్మెంట్ కేసులో టీడీపీ జాతీయ అధ్యక్షుడు, మాజీ సీఎం చంద్రబాబు నాయుడును సీఐడీ
పోలీసులు అరెస్టు చేశారు.
నంద్యాల
ఆర్కే ఫంక్షన్ హాల్ వద్ద చంద్రబాబును అరెస్టు చేసిన పోలీసులు అక్కడి నుంచి
విజయవాడకు తరలించారు. క్రైం నంబరు 29/2021
కేసులో అరెస్టు చేసినట్లు సీఐడీ తెలిపింది.
120(B), 166, 167, 418, 420, 465 సెక్షన్ల
కింద చంద్రబాబును అదుపులోకి తీసుకున్నారు. సీఐడీ చట్టంలోని 12, 13(2) రెడ్ విత్ (1)(c)(d) సెక్షన్లను పోలీసులు చంద్రబాబుపై నమోదు
చేశారు.
చంద్రబాబు
ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో స్కిల్ డెవలప్మెంట్ విభాగంలో అవినీతికి పాల్పడ్డారని రూ.
317 కోట్లు దారి మళ్ళించారనే ఆరోపణలతో కేసు నమోదైంది.
అర్ధరాత్రి
నుంచే చంద్రబాబును అరెస్టు చేసేందుకు పోలీసులు ప్రయత్నాలు ప్రారంభించారు. ఆయన బస
చేసిన ప్రదేశానికి భారీగా చేరుకున్న పోలీసు సిబ్బంది, తెల్లవారు జాము సమయంలో
అదుపులోకి తీసుకున్నారు. వైద్య పరీక్షలు
నిర్వహించిన అనంతరం, ఆయన కాన్వాయ్ లోనే ఎస్ఎస్జీ భద్రతతో విజయవాడ తరలిస్తున్నారు.
అరెస్టుకు సంబంధించిన పత్రాలపై చంద్రబాబు సంతకం చేశారు. విజయవాడలోని ఏసీబీ
కోర్టులో చంద్రబాబును హాజరుపరిచే అవకాశం ఉంది.
చంద్రబాబు
అరెస్టు పై ఆయన తరఫు న్యాయవాది స్పందించారు. వైద్య పరీక్షల్లో చంద్రబాబుకు హైబీపీ,
షుగర్ ఉందని తేలిందని హైకోర్టులో బెయిల్ కు ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు.
కేసుతో సంబంధంలేని సెక్షన్లు నమోదు చేయడంతో పాటు స్కిల్ డెవలప్మెంట్ కేసులో 37వ
ముద్దాయిగా పేర్కొన్నారని తెలిపారు.
శుక్రవారం
అర్దరాత్రి దాటిన తర్వాత చంద్రబాబు బస చేసిన ప్రదేశానికి అధికసంఖ్యలో పోలీసులు
చేరుకున్నారు. అనంతపురం నుంచి పోలీసు బృందాలను నంద్యాలకు రప్పించారు. మొత్తం ఆరు
బస్సుల్లో బలగాలు ఎస్పీ కార్యాలయం వద్దకు చేరుకున్నాయి.
డీఐజీ రఘురామరెడ్డి,
జిల్లా ఎస్పీ రఘువీరారెడ్డి ఆధ్వర్యంలో పోలీసులను మోహరించారు.
ఈ
రోజు ఉదయం 5 గంటలకు చంద్రబాబు బస చేస్తున్న వాహనం వద్దకు పోలీసులు భారీగా
చేరుకున్నారు. వాహనం చుట్టూ ఉన్న టీడీపీ నేతలను కూడా అరెస్టు చేశారు. మాజీమంత్రులు,
మాజీ ఎమ్మెల్యేలు, టీడీపీ ముఖ్యనేతలను పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్కు
తరలించారు.
రాహుల్ గాంధీకి యూపీ కోర్టు సమన్లు