జీ20 దేశాల సమావేశంలో ఇవాళ కీలక ఒప్పందాలపై సంతకాలు జరగనున్నాయి. ఇండియా, సౌదీ అరేబియా, అమెరికాలు ప్రధాన రైల్వే, ఓడరేవు ప్రాజెక్టులను నిర్మించే ఒప్పందాలపై సంతకాలు చేయనున్నాయి. ఇండియా నుంచి మధ్య ప్రాచ్యం మీదుగా ఐరోపా దేశాలకు వాణిజ్యం, ఇంధనం, డేటా బదిలీకి వీలు కల్పించే కీలక ఒప్పందాలపై
అవగాహనా ఒప్పందం జరగనుందని అమెరికా డిప్యూటీ నేషనల్ సెక్యూరిటీ సలహాదారు ఫైనర్ వెల్లడించారు.
సౌదీ అరేబియా, భారత్, యూఏఈ, యూరోపియన్ యూనియన్ దేశాలు ఈ ప్రాజెక్టులో కీలకంగా పాల్గొంటాయని ఫైనర్ న్యూఢిల్లీలో ప్రకటించారు.ఈ ఒప్పందం ఇజ్రాయెల్‌తో అమెరికా సంబంధాలను మరింత బలపరచడానికి దోహతపడుతుందన్నారు. అనేక నెలలపాటు దౌత్యం ఫలితంగా ఈ ఒప్పందాలు జరగనున్నాయని ఫైనర్ చెప్పారు.
ఈ ప్రాజెక్టుకు అపారమైన వాణిజ్య సామర్థ్యం ఉందని, అయితే ఎంత కాలానికి పూర్తవుతుందనే దానిపై స్పష్టత లేదని ఫైనర్ తెలిపారు. ఉక్రెయిన్ రష్యా యుద్ధంపై జీ20 దేశాల అధినేతలు విభేదించారు. కార్బన్ ఉద్గారాలను తగ్గించే కీలకమైన ఒప్పందాలు జీ20లో జరుగుతాయని ఆశిస్తున్నారు.
రాహుల్ గాంధీకి యూపీ కోర్టు సమన్లు