మరికొద్ది గంటల్లో జి-20 సదస్సు కీలక
ఘట్టంలోకి చేరుకుంటోంది. దేశాధినేతల స్థాయి సమావేశాలు రేపు, ఎల్లుండి జరుగుతాయి. వాటికోసం
ప్రముఖులందరూ భారత్ చేరుకుంటున్నారు.
ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కోపరేషన్
అండ్ డెవలప్‌మెంట్ – ఓఈసీడీ సెక్రెటరీ జనరల్ మతియాస్ కార్మాన్ గురువారం రాత్రి
ఢిల్లీకి చేరుకున్నారు.
యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు
చార్లెస్ మిషెల్ భారత్ చేరుకున్నారు.
వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ డైరెక్టర్
జనరల్ ఎంగోజీ ఒకొంజో ఇవియాలా ఢిల్లీలో అడుగుపెట్టారు.
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్,
భారతదేశానికి బయల్దేరారు. అంతకు ముందే ఆయన భార్య జిల్ బైడెన్‌కు కోవిడ్ నెగెటివ్
రిపోర్ట్ వచ్చింది.
స్పెయిన్ అధ్యక్షుడు పెద్రో సాంచెజ్‌కు
కోవిడ్ సోకింది. ఆయన బదులు హాజరవుతున్న ఉపాధ్యక్షురాలు నాదియా కాల్వినో ఢిల్లీ
చేరుకున్నారు.
అర్జెంటీనా అధ్యక్షుడు ఆల్బెర్టో
ఏంజెల్ ఫెర్నాండెజ్ భారత్‌లో ల్యాండ్ అయ్యారు.
ఇటలీ ప్రధానమంత్రి జార్జియా మెలోనీ
భారత రాజధానికి చేరుకున్నారు.
అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ – ఐఎంఎఫ్
– మేనేజింగ్ డైరెక్టర్ క్రిస్టాలినా జార్జియేవా, ఢిల్లీ విమానాశ్రయంలో డాన్స్
చేసారు. అతిథులకు స్వాగతం పలకడానికి ఏర్పాటు చేసిన నాట్యబృందం ఒక ఒడియా పాటకు
నాట్యం చేస్తుండగా ఆమె చూసి సంబరపడిపోయారు. వారు ప్రదర్శిస్తున్న నాట్యాన్ని
చూస్తూ ఒకటిరెండు స్టెప్పులు వేసారు.
ఆఫ్రికన్ యూనియన్ అధ్యక్షుడు అజలీ
అసౌమని ఢిల్లీ చేరుకున్నారు.
బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా జి-20
సమావేశాల కోసం భారత్ వచ్చారు.
యుకె ప్రధానమంత్రి రిషి శునక్ తన
భార్య అక్షతామూర్తితో సహా ఢిల్లీలో ల్యాండ్ అయ్యారు.
జపాన్ ప్రధాని ఫుమియో కిషిడాకు
కేంద్రమంత్రి అశ్వనీకుమార్ చౌబే స్వాగతం పలికారు.
దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్
రామాఫోసాకు కేంద్రమంత్రి రావుసాహెబ్ పాటిల్ దాన్వే స్వాగతం పలికారు.
ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి
ఆంటోనియో గుటెరెస్ భారత్ చేరుకున్నారు.
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్
ప్రతినిధిగా ఆ దేశపు విదేశాంగ మంత్రి సెర్గే లావ్రోవ్ ఢిల్లీ చేరుకున్నారు.
యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు
ఉర్సులా వాండెర్ లెయెన్ భారతదేశంలో అడుగుపెట్టారు.
దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సూక్
యేల్, భార్యాసమేతంగా భారత్ చేరుకున్నారు.
భారత ప్రధాని నరేంద్రమోదీ ఈ సాయంత్రం మారిషస్
ప్రధాని ప్రవింద్ జగ్‌నాథ్, బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనాలతో ద్వైపాక్షిక చర్చలు
జరిపారు.
రాహుల్ గాంధీకి యూపీ కోర్టు సమన్లు